తమిళ్ తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకుంది నటి వనితా విజయ్ కుమార్. ముఖ్యంగా తమిళంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. ఈమె మూడో భర్త పీటర్ పాల్ కన్నుమూసినట్లుగా తెలుస్తోంది.గత కొద్ది కాలంగా ఈయన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చెన్నైలోనే ఒక ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా సమాచారం. అయితే గత కొద్ది నెలల క్రితం వనితా విజయ్ కుమార్ పీటర్ పాల్ వివాహం చాలా అత్యంత వివాదంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పీటర్ పాల్ మరణ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.


నటి వనిత విజయ్ కుమార్ పీటర్ పాల్ 2020 జూన్ 27వ తేదీన పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలం అఫైర్ నడిచినట్లుగా కూడా వార్తలు వినిపించాయి. సినీ పరిశ్రమలు విజువల్ ఎఫెక్ట్ డైరెక్టర్ గా పని చేసిన పీటర్ పాన్ న్ వీరిద్దరిని ఒక సినిమా కలిపింది. స్క్రిప్ట్ చెప్పే విషయంలో వీరిద్దరి ప్రేమలో పడ్డారని.. ఆ ప్రేమ పెళ్లి వరకు తీసుకువెళ్లిందని తెలుస్తోంది.. అయితే పీటర్ పాల్ తన భార్య ఎలిజబెత్  తనకు విడాకులు ఇవ్వకుండానే వనితా విజయ్ కుమార్ ని వివాహం చేసుకుంటున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది.


దీంతో వనితా విజయ్ కుమార్ పెళ్లి తెగ వైరల్ గా మారింది. వీరి పైన పలువురు సినీ సెలబ్రిటీలు టెలివిజన్స్ కూడా పలు రకాలుగా కామెంట్లు చేశారు .అయితే పీటర్ పాల్ మద్యానికి బానిస అవ్వడంతో ఈ విషయం వనితా విజయ్ కుమార్ కు నచ్చకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారట.. పీటర్ పాల్ తనతో తప్పుడు రీతులో ప్రవర్తిస్తున్నారని వనిత విజయ్ కుమార్ అక్టోబర్ 2020లో విడాకులు తీసుకోవడం జరిగింది. పీటర్ పాల్ ఇక అప్పటినుంచి పెద్దగా ఎక్కడ కనిపించలేదు.. కానీ ఇటీవల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో  హాస్పిటల్ పాలయ్యారట.దీంతో చెన్నైలోనే హాస్పిటల్ చేరిన పీటర్ చికిత్స పొందుతూ మరణించినట్లుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: