రామబాణం సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి నటిస్తున్నది. సినిమాని డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కించిన ఈ చిత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ పై నిర్మించారు. సంగీతాన్ని మిక్కీ జే మేయర్ అందించక కీలకమైన పాత్రలు జగపతిబాబు , కుష్బూ నటిస్తున్నది. ఈ సినిమా మొదటి నుంచి భారీగాని అంచనాలు పెంచేస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ సాంగ్ ట్రైలర్ కూడా మరింత ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.
ఒకవైపు పలు మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ మరొకవైపు టీవీ కార్యక్రమాలలో జరిగేటువంటి వాటికి కూడా గెస్ట్లుగా వెళుతున్నారు చిత్రబృందం. తమ సినిమాని మరింత ప్రమోట్ చేసే దానికోసం పాల ప్యాకెట్ల మీద తమ సినిమా పోస్టర్ని వేయడం ద్వారా ఈ సినిమాకి మరింత ప్రమోషన్స్ చేయడానికి వీలుంటుందని చిత్ర బృందం ఆలోచించి ఇలాంటి వాటిని ప్రమోషన్ చేస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమా ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో లేదో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే. అయితే ఈ పోస్టర్ పైన రామబాణం చిత్రం ఒక ఆరోగ్య కొటేషన్ కూడా ముద్రించి తెలియజేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది