తాజాగా అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా మిక్స్డ్ టాక్ కారణంగా అక్కినేని అభిమానులు నిరాశ పడుతున్నారు. మాస్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని భావించి అఖిల్ ఈ సినిమాలో చేసిన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమా స్టోరీని మించిపోయే విధంగా ఉండడంతో ఈ సినిమా నిరాశపరిచింది.ఇదిలా ఉంటే ఇక అక్కినేని నాగచైతన్య తమ్ముడు అఖిల్ ఏజెంట్ సినిమా ప్రమోషన్స్ కారణంగా ఆయన హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు అసలు ఏవి కూడా ప్రారంభించలేదు. కానీ ఈ సినిమా 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు మాత్రం అధికారికంగా ప్రకటన చేశారు. 

ఈ సినిమాలో నాగచైతన్య పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమాకి సంబంధించిన హడావుడి పూర్తయిన తర్వాత తన కస్టడీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను మొదలు పెట్టాలని అనుకున్నాడు నాగచైతన్య. కానీ ఎవరు ఊహించని విధంగా నాగచైతన్యకి ఏజెంట్ రూపంలో పెద్ద షాక్ తగిలింది అని చెప్పాలి. ఈ సినిమా ఎంతటి నెగిటివిటీని ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య తన కస్టడీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో గందరపోవడానికి గురవుతున్నాడని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే కస్టడీ నిర్మాతలు నాగచైతన్య ని ఒత్తిడి చేస్తున్నారని కూడా తెలుస్తోంది. నాగచైతన్య అడ్డంగా బుక్ అయినట్లుగా సినీ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇదిలా ఉంటే ఇక అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా కలెక్షన్స్ పడిపోవడంతో పాటు మరొక విరూపాక్ష సినిమా కలెక్షన్స్ ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఏజెంట్ సినిమా థియేటర్లు ఖాళీగా ఉండడం గమనార్హం .ఈ సినిమాతో నైనా తన తమ్ముడు ఇరగదీస్తాడేమో అని భావించి తన కస్టడీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వాయిదా వేసుకున్న నాగచైతన్య తాజా పరిణామాలతో సతమతమవుతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే తన కస్టడీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: