జబర్దస్త్ పైమ అంటే తెలియని వారు ఉండరు. ఫైమా కామెడీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఎంతో ఇష్టం అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే ఈమె ఒక ముస్లిం కుటుంబానికి చెందిన ఆమె.ఈమె  తో కలిపి వీరి కుటుంబంలో నలుగురు ఆడపిల్లలు. చిన్నతనంలోనే ఫైమా తండ్రి మరణించాడు. దీంతో ఫైమ తల్లికి తన నలుగురు ఆడపిల్లలను పెంచడానికి చాలా కష్టపడాల్సి వచ్చిందట. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేని స్థితిలో ఆమె తన నలుగురు పిల్లలకు చదువు చెప్పినది తనకి ఉన్న ఏకైక ఆశయం. ఇక అలాంటి సమయంలో ఫైమాకి పటాస్ షోలో అవకాశం వచ్చింది. 

యాంకర్ రవి ఆమెను ఎంకరేజ్ చేసి పటాస్ లో చేసేందుకు అవకాశాన్ని ఇప్పించాడు. ఇక అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకొని ఫైమా వరుస షోలు చేస్తూ బిజీగా మారింది. దాని తర్వాత పోవే పోరా జబర్దస్త్ వంటి షోలలో ఈమె కామెడీతో అందరినీ ఆకట్టుకుంది. గత ఎడాది ఫైమా బిగ్ బాస్ 6 లో కూడా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇలా వరుసగా షోలలో అటు బిగ్ బాస్ లో పాల్గొన్న ఫైమా బాగానే సంపాదించినట్టు తెలుస్తోంది. ఫైమ తన తల్లికి తోడుగా ఉండి తన సోదరీల జీవితాన్ని తీర్చిదిద్దింది. వాటితోపాటు హైదరాబాద్లో సొంతంగా ఒక ఇల్లును కూడా కొనుక్కుంది.

అంతే కాదు ఈ మధ్యకాలంలోనే ఒక లగ్జరీ కారును కూడా ఫైమా కొనుగోలు చేసింది. జబర్దస్త్ బిగ్ బాస్ బేబీ జోడి యూట్యూబ్ ఇలా అన్నిటి ద్వారా భారీ మొత్తంలో ఫైన్ ఆ సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇదంతా చూస్తుంటే పైనకి కోటికి పైగానే ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. తనలోని కామెడీ టైమింగ్ దీనికి కారణం అని చెప్పొచ్చు. గతంలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న పైన ఇప్పుడు మంచి స్థాయిలో ఉంది. నల్లగా ఉందని ఆమెని ఎంతోమంది చిన్నచూపు చూసేవారని చాలా సందర్భాలలో ఆమె పేర్కొంది. చివరికి అందం తిండి పెట్టదు అని టాలెంట్ ఉంటేనే అన్ని సమకూర్చుకోగలం అని ప్రూఫ్ చేసింది ఫైమ. దీంతో ఫైమా ఆస్తులకు సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: