టీం లో ఒకడిగా వచ్చి తన టైమింగ్ తో అలరించిన ఇమ్మాన్యుయెల్ ఎక్కువగా భాస్కర్ టీం లో చేశాడు. భాస్కర్ కూడా ఇమ్మాన్యుయెల్ టైమింగ్ ను వాడుకుని మంచి స్కిట్స్ చేశాడు. ఇక నల్ల అబ్బాయి తెల్ల అమ్మాయి అంటూ వర్షతో ఇమ్మాన్యుయెల్ ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీ క్రేజ్ తెచ్చింది. ఫైనల్ గా ఇమ్మాన్యుయెల్ ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కొత్త టీం లీడర్ గా మారాడు. ఇస్మార్ట్ ఇమ్మాన్యుయెల్ అని టీం ఏర్పరచుకున్నాడు. తను కంటెస్టంట్ గా ఉన్నప్పుడే తన సత్తా చాటిన ఇమ్మాన్యుయెల్ ఇక టీం లీడర్ అయ్యాక ఆగుతాడా చెప్పండి.
టీం లీడర్ గా మొదలు పెట్టిన ఫస్ట్ స్కిట్ తోనే అదరగొట్టాడు. లేటెస్ట్ గా వచ్చిన ప్రోమో చూస్తే ఇమ్మాన్యుఎల్ బి.ఆర్.ఎస్ మంత్రి మలారెడ్డిని ఇమిటేట్ చేస్తూ కష్టపడ్డా.. పాలమ్మినా.. పూలమ్మినా అంటూ స్కిట్ లో అలరించాడు. ఇక వైఎస్ షర్మిల డైలాగ్ ని కూడా వాడేశాడు. మొత్తానికి కుర్రాడికి ఇదొక మంచి ఛాన్స్ అని చెప్పొచ్చు. ఇమ్మాన్యుయెల్ సరిగ కాన్సెంట్రేట్ చేస్తే మిగతా వారందరిలానే జబర్దస్త్ లో పర్మినెంట్ టీం లీడర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓ విధంగా చెప్పాలంటే ఇది అతనికి ఒక గొప్ప అవకాశమని చెప్పొచ్చు.