
అయితే ఇతరత్రా అనారోగ్య సమస్యలు చోటు చేసుకోవడంతో ఈయన ఆరోగ్య పరిస్థితి విసమించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇవి ఆ వాస్తవాలు అంటూ ఆమె తెలియజేస్తోంది.. శరత్ బాబు అసలు పేరు సత్యం బాబు దీక్షితులు.. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటుడుగా గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ఈయన పేరు శరత్ బాబుగా మార్చుకున్నాడు. తెలుగు, తమిళ్ ,కన్నడ ఇతర భాషలలో కూడా పలు చిత్రాలలో నటించిన శరత్ బాబు దాదాపుగా 200 చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకున్నారు.
1973లో రామరాజ్యం అనే సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన శరత్ బాబు ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. ఆమదాలవలసలో జన్మించిన శరత్ బాబు పోలీస్ కావాలని కోరిక ఉండేదట కానీ ఆయన కళ్ళ సమస్య వల్ల పోలీస్ కాలేకపోయారని సమాచారం. ఆ తర్వాత ఒక పేపర్లో యాడ్ చూసి సినిమా యాక్టర్ ఆడిషన్ కు వెళ్లారు. అలా డైరెక్టర్ బాలచందర్ దర్శకత్వం వహించిన ఇది కథ కాదు అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఎంతోమంది నటీనటులతో కలిసి నటించిన ఈయన రమప్రభాను 1988లో వివాహం చేసుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఆమె నుండి విడిపోవడం జరిగింది. ఎట్టకేలకు శరత్ బాబు ఆరోగ్యం పై తన సోదరి క్లారిటీ ఇచ్చింది.