బాలకృష్ణ వారసుడుగా మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తే చూడాలని బాలయ్య అభిమానులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కూడ ఆశక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే అంటూ లీకులు ఇవ్వడం ఆతరువాత నిశ్శబ్దంలోకి వెళ్ళడం బాలకృష్ణ కాంపౌండ్  కు సర్వసాధారణంగా మారింది.


స్వయంగా బాలకృష్ణ అనేక ఇంటర్వ్యూలలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి పాజిటివ్ గా చెపుతున్నప్పటికీ స్పష్టమైన క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. దీనితో వాస్తవానికి మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అన్న సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ ఇండస్ట్రీ వర్గాలలో ప్రచారంలోకి వచ్చింది.



ప్రస్తుతం రామ్ తో సినిమాను తీస్తున్న బోయపాటి ఆసినిమా పూర్తి అయిన వెంటనే ‘అఖండ 2’ గురించి దృష్టి పెట్టే విధంగా అతడి ఆలోచనలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన రఫ్ స్క్రిప్ట్ ఫైనల్ కావడంతో బాలకృష్ణ అనుమతి తీసుకుని ఆసినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యే దశలో బోయపాటి ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు.


ఈకథకు సంబంధించి బాలకృష్ణతో పాటు ఒక యంగ్ హీరో పాత్ర కూడ ఉండటంతో ఆపాత్రను మోక్షజ్ఞ తో చేయిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన బాలకృష్ణకు వచ్చిందని దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే బాలకృష్ణ సినిమాలో మోక్షజ్ఞ నటిస్తాడు అన్నవార్త కొత్తది కాదు. గతంలో ‘లెజెండ్’ సినిమా షూటింగ్ సమయంలోను ఆతరువాత ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ మూవీ షూటింగ్ సమయంలోను ఇలాంటి వార్తలే వచ్చాయి. ఆ వార్తలు ఏమీ నిజం కాలేదు. దీనితో మోక్షజ్ఞ ఎంట్రీ కనీసం ‘అఖండ 2’ లో అయినా ఉంటే బాగుంటుందని బాలయ్య అభిమానులు కలలు కంటున్నారు. వచ్చే సంవత్సరం జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల లోపు ఈమూవీ విడుదల ఉంటుంది అంటున్నారు. అంతేకాదు ‘అఖండ 2’ లో చాల పొలిటికల్ మసాల డైలాగ్స్ ఉండేలా డిజైన్ చేస్తున్నారని టాక్..  




మరింత సమాచారం తెలుసుకోండి: