ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో హీరోగా నటించిన మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే తాజాగా ధనుష్ సార్ అనే సినిమా ద్వారా డైరెక్ట్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఎంతటి అద్భుతమైన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ధనుష్ .ఈ సినిమా తర్వాత ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు ధనుష్. 

అయితే తాజాగా కెప్టెన్ మిల్లర్ షూటింగ్లో పాల్గొంటున్నాడు ధనుష్ .అయితే తాజాగా బ్రేక్ సెషన్ లో తన అభిమానులతో ముచ్చటించాడు. ఈ నేపథ్యంలోనే తన అభిమానులు మీ ఫేవరెట్ తెలుగు హీరో ఎవరు అని అడిగారు. ఇక తన అభిమానులు అడిగిన ప్రశ్నకి ఏమాత్రం ఆలోచించకుండా తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటూ ఎవరు ఊహించని సమాధానాన్ని చెప్పుకొచ్చాడు ధనుష్. ఇప్పుడే కాదు గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్పిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఆ పోస్ట్ ని కూడా చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ వైరల్ చేశారు.

ఇక తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పడంతో పవన్ అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. ఇకపోతే ధనుష్ తన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అని చెప్పడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అనంతరం కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సైతం తన ఫేవరెట్ హీరోల గురించి మాట్లాడాడు. కోలీవుడ్లో తన ఫేవరెట్ హీరో అజిత్ అంటూ చెప్పుకొచ్చాడు ధనుష్. కానీ మీరు గట్టిగా అడిగితే మాత్రం నా ఫేవరెట్ హీరో ఎప్పటికీ రజినీకాంత్ అంటూ చెప్పకనే చెప్పాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: