ఒకనాటి గ్లామర్ క్వీన్ ఖుష్బూ సీనియర్ హీరోయిన్ గా మారిన తరువాత అనేక సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతోంది. సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో కూడ చాల యాక్టివ్ గా ఉంటూ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో కొనసాగుతోంది. ప్రస్తుత రాజకీయాల పై ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల పై చాల ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఆమెకు అలవాటు.



ఒకప్పటి సీనియర్ హీరోలు అందరితోను నటించిన ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెనక్తేష్ వ్యక్తిత్వం పై కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ‘వెంకటేష్ అంటే నాకు చాలా సెంటిమెంట్. నా ఫస్ట్ హీరో అతడు అంతే కాదు నా ఫస్ట్ ఫ్రెండ్ కూడా. నేను వెంకీ ప్రతి రోజూ మాట్లాడుకోం. కానీ నాకేదైనా ప్రాబ్లమ్ వస్తే వెంకీ నాతో ఉంటాడు. సెంటిమెంటల్ అనే పదంలో వెంకటేష్ సెంటి పార్ట్ అయితే నేను మెంటల్ పార్ట్. అంతలా కలిసిపోతాం’ అంటూ వెంకటేష్ తో తనకున్న సాన్నిహిత్యాన్ని మరొకసారి బయటపెట్టింది.



1980 కాలంనాటి హీరో హీరోయిన్లు 32 మంది ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నారట. అందులో చిరంజీవి రజనీకాంత్ లతో పాటు చాలామంది తెలుగు హీరోలు కూడ ఉన్నారు. ఆ గ్రూప్ లో వారంతా తెల్లారి లేచిన దగ్గర నుండి తాము చేసిన విషయాలు ఒకరికొకరు షేర్ చేసుకుంటారట. ఆ గ్రూప్ లో వెంకటేష్ కూడ ఉన్నాడట. అయితే తాము షేర్ చేసుకునే విషయాలకు వెంకటేష్ రెస్పాండ్ అవ్వడని అయితే కలిసినప్పుడు మాత్రం చాల ఆత్మీయంగా మాట్లాడుతాడని కామెంట్స్ చేసింది.



ప్రస్తుతం ‘రామబాణం’ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఖుష్బూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ అనేక మీడియా ఇంటర్వ్యూలు ఇస్తోంది. సినిమాలలో నటించడం తనకు చాల ఇష్టం అనీ అయితే తనకు నచ్చిన పాత్ర వచ్చినప్పుడు మాత్రమే తాను నటిస్తున్నానని అన్ని సినిమాలు తాను ఒప్పుకోవడం లేదు అని అంటోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: