తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న వారిలో శ్రీ వాస్ ఒకరు. ఈ దర్శకుడు తన కెరీర్ లో ఇప్పటి వరకు చాలా మూవీ లకు దర్శకత్వం వహించాడు. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధిస్తే మరి కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులు నిరాశ పరచాయి. కాకపోతే ఈ దర్శకుడు దర్శకత్వం వహించిన సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ మూవీ లుగా కూడా నిలిచాయి.

శ్రీ వాస్ కెరియర్ లో లక్ష్యం ... లౌక్యం ... డిక్టేటర్ మూవీ లు  బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు గోపీచంద్ హీరో గా రూపొందిన రాముబాణం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటించగా ... కుష్బూ ... జగపతి బాబు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది.

మూవీ విడుదల సందర్భంగా ఈ మూవీ దర్శకుడు శ్రీ వాసు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా శ్రీ వాసు "రామబాణం" మూవీ గురించి మాట్లాడుతూ ... హర్రర్ ... డార్క్ ... రగ్గడ్ మూవీ లు విడుదలై విజయం సాధిస్తే అందరూ అవే సినిమాలు చూస్తారని అనుకుంటాం కానీ నాకున్న అనుభవం ... అవగాహన ప్రకారం కుటుంబం అంతా కలిసి వెళ్లి చూడడానికి ఒక మంచి సినిమా కావాలి. అందరూ కూర్చొని హ్యాపీగా చూసే సినిమా అవసరం. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే సినిమా రావడం లేదని వెలితి ఎప్పుడు ఉంటుంది. ఆ వెలితిని రామబాణం మూవీ భర్తీ చేస్తుంది అని శ్రీ వాస్ తాజాగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: