బాలీవుడ్లో జూన్ నెలలో విడుదల కాబోతున్న చిత్రాలలో షారుక్ ఖాన్ హీరోగా తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వస్తున్న జవాన్ సినిమా ఒకటి జూన్ రెండవ తేదీన విడుదల తేదీ ప్లాన్ చేశారు ఇక ప్రభాస్ హీరోగా వస్తున్న ఆది పురుష్ చిత్రం కూడా జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు . ఈ రెండు సినిమాల మధ్య రెండు వారాల గ్యాప్ ఉన్నప్పటికీ ఒక సినిమాకు మరొక సినిమా పోటీ వస్తుందని చెప్పవచ్చు అయితే షారుక్ ఖాన్ జవాన్ సినిమా విడుదల వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి.


సినిమా అసలైతే జూన్లో విడుదల చేసుకోవాలనుకోక ఈ సినిమా నిర్మాంతర కార్యక్రమాలు ఇంకా పూర్తి కాలేకపోవడంతో హడావిడిగా విడుదల ఎందుకని సినిమాని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది .ఆది పురుష్ చిత్రం మాత్రం జూన్ 16వ తేదీన పక్కాగా విడుదల చేయబోతున్నారు. షారుఖ్ సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఉండడంతో ప్రభాస్ సినిమాకి కాస్త ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతున్నది. ఈ సినిమా రామాయణ కథ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. ఇందులో ప్రభాస్ రాముడు గా ఉండగా సీతగా కృతి సనన్ నటిస్తూ ఉన్నారు.


ఆది పురుష్ సినిమా గ్రాఫిక్స్ విషయంలో కాస్త నెగిటివిటీ కామెంట్లు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి VFX పనులను పూర్తి చేసి విడుదల చేయడానికి సిద్ధమయ్యింది చిత్ర బృందం. ఈనెల లో ఈ సినిమా ట్రైలర్ను కూడా విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయ్యింది. జవాన్ సినిమా సౌత్ లోనే కాకుండా భారీగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది అట్లీ సినిమా తెలుగులో కూడా మంచి కమర్షియల్ గా హిట్టవుతూ ఉన్నాయి. ఈ సినిమా కూడా అదే రేంజర్ వెలకెక్కించాలని చూస్తున్నారు డైరెక్టర్.పఠాన్ సినిమాతో  విజయ దిశగా దూసుకుపోతున్న షారుక్ ఖాన్ మరి సినిమాతో ఎలా సక్సెస్ అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: