మొదటి రెండు సినిమాలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో దర్శకుడు పరశురాం కి ఇండస్ట్రీలో మంచి పేరు అయితే లభించింది. ఆ వెంటనే సోలో సినిమాని కూడా రూపొందించాడు. ఆ సినిమా నిరాశ పర్చడంతో కాస్త గ్యాప్ తీసుకొని మరీ మళ్ళీ రవితేజతో సారొచ్చారు అనే సినిమాని తెరకెక్కించాడు. ఆ సినిమా కూడా నిరాశ పరిచింది. దాంతో ఏకంగా నాలుగు సంవత్సరాల పాటు దర్శకత్వానికి ఆయన దూరంగా ఉన్నాడు.2016 సంవత్సరంలో శ్రీరస్తు శుభమస్తు అనే సినిమా ను ఆయన చేశాడు.. అది కూడా నిరాశ పర్చింది. 2018 లో గీతా గోవిందం సినిమా ను చేయగా సూపర్ డూపర్ హిట్ అయింది.
ఆ సినిమా సూపర్ హిట్ అయిన కూడా సరైన నిర్ణయం తీసుకోక పోవడం వల్ల 2022 వరకు తదుపరి సినిమా కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందట.. 2022 సంవత్సరంలో మహేష్ బాబుతో తెరకెక్కించిన సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మహేష్ బాబు తో సినిమా కు ముందు నాగ చైతన్యతో ఒక సినిమా ను పరశురాం తెరకెక్కించాలనుకున్నాడని సమాచారం.అధికారికంగా ప్రకటన కూడా వచ్చింది. నాగ చైతన్య తో సినిమా ప్రారంభించాలి అనుకుంటుండగా మహేష్ బాబుతో సినిమా ఆఫర్ రావడం తో ఆ సినిమా ను పక్కన పెట్టేసి మహేష్ బాబు సినిమా ని చేశాడట.. మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా పూర్తి అయిన తర్వాత నాగ చైతన్య తో మళ్ళీ సినిమా ను మొదలు పెట్టేందుకు పరుశురాం రెడీ అయ్యాడట.. నాగ చైతన్య కూడా ఓకే చెప్పాడు. కానీ ఇంతలో దిల్ రాజు, విజయ్ దేవరకొండ నుండి పిలుపు రావడంతో మరో సారి నాగచైతన్య సినిమా ను ఆయన పక్కన పెట్టాడు. పెద్ద ఆఫర్ వచ్చినప్పుడు చిన్న ఆఫర్ ని పక్కన పెట్టడం ఈయన కి అలవాటు అంటూ కొందరు వారి అభిప్రాయం చేస్తున్నారు. అల్లు అరవింద్ ఏకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పరశురాంపై తీవ్ర విమర్శలు చేయాలనుకున్నాడట .. కానీ ఇతర నిర్మాతల విజ్ఞప్తితో ఆగిపోయాడట.. నాగ చైతన్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆ దర్శకుడి గురించి అస్సలు మాట్లాడటమే తనకు ఇష్టం లేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు.