తెలుగు లో ఒక హీరో తో ప్రేమలో పడి విఫలం కావడమే ఒక కారణం అని కూడా వార్తలు వినిపిస్తాయి.
ప్రస్తుతం రెజీనా చేతిలో ఈ ఏడాది 4 సినిమాలు ఉన్నాయట. అందులో ఒక్కటి కూడా తెలుగు సినిమా అయితే కాదు. అన్ని తమిళ సినిమాలే ప్రస్తుతం ఆమె చేస్తుంది. ఇక సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా రెజీనా చాలా బిజీ గా ఉంది.కాగా ఆమె ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ లలో నటించడం వల్ల ప్యాన్ ఇండియా వ్యాప్తంగా బాగానే పాపులారిటీ ని తెచ్చుకుంటుంది. కానీ ఆమె తెలుగు లో మాత్రం బిజీ కాలేక పోతుంది.
రెజీనా చివరగా శాకినీ డాకిని అనే సినిమాలో మెయిన్ లీడ్ చేసిన అది పెద్దగా అయితే ఉపయోగపడలేదు. ఇక ఎవరు సినిమా తర్వాత ఆచార్య లో శాన కష్టం అనే పాటలో కనిపించిన రెజీనా ఆ తర్వాత ఎక్కడ కూడా కనిపించలేదు. మరి ఇప్పట్లో ఆమె తెలుగు చిత్రాల్లో కనిపించే అవకాశం కూడా కనిపించడం లేదు. రెండు వెబ్ సిరీస్ ల నాలుగు తమిళ్ సినిమాల్లో కనిపిస్తున్న ఆమె వీటిని పూర్తి చేయానికి మరొక రెండేళ్లు టైం అయితే తీసుకోవచ్చు. మరి అన్ని రోజుల పాటు ఆమెను తెలుగు వారు గుర్తుంచుకోవడం అనేది ఉండదు. అందువల్లే దాదాపు ఆమె కెరీర్ తెలుగు లో ఇక ముగిసినట్టే అంటుకుంటున్నారు. పోనీ ఏదైనా పెద్ద సినిమాలో కనిపిస్తుందా అది కూడా కష్టమేనట.తెలుగు చాల చక్కగా మాట్లాడే రెజీనా తెలుగులో బిజీ ఆర్టిస్ట్ గా లేకపోవడం నిజంగా బాధాకర విషయమే.ఇక పోతే ఈ 32 ఏళ్ళ చిన్నది తెలుగు లో తొలిసారి నటించిన శివ మనసులో శృతి సినిమాకు ఉత్తమ నటిగా అవార్డు ను కూడా దక్కించుకుంది..