ప్రస్తుతం ' కాంతార 2'తో రిషబ్ బిజీగా ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే 'కాంతార' ప్రీక్వెల్ స్క్రిప్ట్‌ను కూడా ప్రారంభించాడు. ఇప్పుడు కాంతారా అభిమానులకు అదిరిపోయే అప్డేట్ వచ్చింది.కాంతార 2 స్క్రిప్ట్ మొదటి డ్రాఫ్ట్ ఫైనల్ అయిందట.. ఈ వార్త విన్న అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కాంతార చిత్రాన్ని హోంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించాడు. సప్తమి గౌడ కథానాయికగా నటించింది.మొదటి భాగం విజయం సాధించడంతో రెండో భాగం పనుల్లో రిషబ్ బిజీగా ఉన్నాడు. ప్రీక్వెల్‌కి సంబంధించిన స్క్రిప్ట్ దాదాపుగా ఫైనల్ అయిందని తెలుస్తుంది.
రిషబ్ శెట్టి, అతని టీమ్ మొదటి డ్రాఫ్ట్‌తో సంతృప్తి చెందారట.ఇంకొద్దిగా టైమ్ తీసుకుని స్క్రిప్ట్‌ని మళ్ళీ రివ్యూ చేస్తాడట రిషబ్. ఏదైనా మార్పు అవసరం అయితే, అది చేసిన తర్వాత స్క్రిప్ట్ ఖరారు అవుతుందని తెలుస్తుంది.. దీంతో పాటు సినిమా షూటింగ్ లొకేషన్‌ను వెతికే పని కూడా ఉంటుందట.. ఇప్పటికే కోస్టల్ కర్ణాటకలో కొన్ని లోకేషన్స్ ను కూడా చూశాడు రిషబ్. కాంతార 2 సినిమా షూటింగ్ వర్షాకాలంలో ప్రారంభం కానుందని తెలుస్తుంది..
కాంతార సినిమా చూసిన ప్రేక్షకులు చాలా మంది ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందనే అంచనాలు కూడా ఏర్పడ్డాయి. అయితే చిత్ర యూనిట్ ప్రీక్వెల్ ను ప్రకటించింది.ఆ మధ్యన రిషబ్ శెట్టి స్క్రిప్ట్ వర్క్ కూడా ప్రారంభించినట్లు చెప్పాడు. కొన్ని నెలల్లోనే మొదటి దశ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశాడు.
సినిమాలకు సీక్వెల్ రావడం సహజమే. కానీ, రిషబ్ శెట్టి కాంతారకి ప్రీక్వెల్ ను చేస్తున్నాడు. అంటే ఇప్పుడు చూసిన కథ కంటే ముందు అస్సలు ఏం జరిగిందని చూపించనున్నారు. ఈ విషయంపై అభిమానులు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు. సినిమా చూసేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఏకంగా రూ.500 కోట్ల వరకూ కలెక్షన్స్ వసూలు చేసింది. కన్నడలోనే కాదు తెలుగు, తమిళం మరియు హిందీ లో కూడా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.