అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే అఖిల్ తాజాగా ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా ... సాక్షి వైద్య ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. హిప్ హాప్ తమిజ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మించిన ఈ మూవీ లో సాక్షి వైద్య అఖిల్ కి జోడి గా నటించింది.

మూవీ ని మొదట పాన్ ఇండియా మూవీ గా తెలుగు తో పాటు తమిళ  కన్నడ , మలయాళం , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం మొదట ప్రకటించింది. కాకపోతే ఆ తర్వాత ఏమి అయ్యిందో తెలియదు కానీ ఈ సినిమాను ఏప్రిల్ 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా కేవలం తెలుగు భాషలో మాత్రమే విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగటివ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ మూవీ కి మొదటి రోజు తప్ప మిగతా ఏ రోజు కూడా భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కలేదు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని నిర్మాతలు భారీ బడ్జెట్ తో రూపొందించిన కారణంగా ఈ సినిమాకు అత్యంత భారీ బడ్జెట్ అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ సినిమాను తెలుగు తో పాటు తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు కాకపోతే ఆ తర్వాత కేవలం తెలుగు లోనే మాత్రమే విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ మూవీ కి ఆశించిన కలెక్షన్ రాలేదు. దానితో ఈ మూవీ కి గాను నిర్మాతలకు దాదాపు 30 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఈ మూవీ లో అఖిల్ పర్ఫామెన్స్ కు ప్రేక్షకులం నుండి మంచి రెస్పాన్స్ లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: