సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను తెలుసుకోవడానికి జనాల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ప్రేమ, పెళ్లిళ్ల వ్యవహారాలమైతే ఇంకా చెప్పనవసరం లేదు. అలాగే యాంకర్ శ్రీముఖి కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.30 ప్లస్ లో అడుగుపెట్టిన శ్రీముఖి ఎప్పుడు తన పెళ్లిపై స్పందించింది లేదు. గతంలో శ్రీముఖి ఒక సందర్భంలో 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది .దీంతో తాజాగా శ్రీముఖి 30 లో అడుగుపెట్టడంతో త్వరలోనే ఈమె పెళ్లి చేసుకోబోతుంది అన్న ప్రచారం జరుగుతుంది. ఇక హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తను శ్రీముఖి వివాహం చేసుకోబోతుంది అన్న వార్తలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

చాలాకాలంగా వారిద్దరూ రిలేషన్ లో కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఇరు కుటుంబాల పెద్దలకు వీరిద్దరి వివాహం ఇష్టమే అన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే శ్రీముఖి పెళ్లి పీటలు లేకపోతె ఉందన్న వార్తలు సైతం వినపడుతున్నాయి. ఇకపోతే శ్రీముఖి పెళ్లి చేసుకోబోయే ఆ వ్యాపారవేత్తకు వంద కోట్లు పైగానే ఆస్తులు కూడా ఉన్నాయి .అయితే మొత్తంగా శ్రీముఖి ఈ బర్త్డే సందర్భంగా ఒక కీలక నిర్ణయం తీసుకుంటుందట.ఏ వయసులో జరగాల్సినవొచ్చిన ఆ వయసులో జరగాలని శ్రీముఖి పెళ్లికి ఫిక్స్ అయిందని తెలుస్తోంది. మే 10న శ్రీముఖి పుట్టినరోజు.

ఈ సందర్భంగా ఆమె తన పుట్టినరోజుని విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీముఖి థాయిలాండ్ లో తన బంధుమిత్రులతో కలిసి తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంది. సెలబ్రేషన్స్ ముగిసిన అనంతరం ఆమె తిరిగి ఇండియాకు రానుంది. ఇకపోతే ప్రస్తుతం శ్రీముఖి వరుస షోలు చేస్తూ దూసుకుపోతుంది. పలు షోలకి యాంకర్ గా వ్యవహరిస్తోంది శ్రీముఖి. ప్రస్తుతం ఆమె టాప్ యాంకర్ పొజిషన్లో ఉంది .యాంకర్ గా నే కాకుండా హీరోయిన్గా కూడా ప్రయత్నాలు చేస్తోంది శ్రీముఖి .దీంతో శ్రీముఖికి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: