దీంతో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ తన కొత్త సినిమాను మే 15వ తేదీన ప్రకటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అది కూడా హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ -2 అన్నట్లుగా సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా తెలియజేయలేదు చిత్ర బృందం. ఈ చిత్రంతోనైనా డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరొకసారి తన కెరీర్ ని మలుపు తిప్పుకుంటారేమో అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. పూరి జగన్నాథ్ గతంలో ఎంతోమంది హీరోలను సైతం స్టార్ హీరోలుగా మార్చారు.
విజయ్ దేవరకొండ తో జనగణమన సినిమా అని అనౌన్స్మెంట్ చేయగా లైగర్ సినిమా ఫ్లాప్ తో ఒక్కసారిగా ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇక హీరో రామ్ కూడా ది వారియర్ చిత్రంతో భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్న రామ్ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కూడా ఫుల్ యాక్షన్ చిత్రంగా ఉండబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ సినిమాతో మాస్ హీరోగా మరొకసారి అదరగొడతారేమో చూడాలి మరి.