టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య కి  ఎలాంటి క్రేజ్ ఉందో  ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తన తండ్రి కింగ్ నాగార్జున తర్వాత మళ్లీ అలాంటి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు చైతు. తాజాగా 'కస్టడీ' అనే మూవీ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. అయితే తాజాగా నాగచైతన్యతో సినిమా చేసేందుకు ఓ హీరోయిన్ నో చెప్పిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అది ఏ సినిమా? అనే వివరాల్లోకి వెళితే.. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చైతు నటించిన 'కస్టడీ' మూవీ మే 12న విడుదలైన సంగతి తెలిసిందే. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో చైతుకి జోడిగా కృతిశెట్టి హీరోయిన్గా నటించింది. 

ప్రస్తుతం థియేటర్లో ఈ మూవీ డివైడ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో కృతి శెట్టి రేవతి అనే పాత్రలో నటించింది. అయితే నిజానికి రేవతి పాత్ర కోసం ముందుగా అనుకున్నది కృతి శెట్టి ని కాదట. మరో స్టార్ హీరోయిన్ ఎంపిక చేయగా.. చిన్న చిన్న కారణాలతో ఆమె ఈ మూవీ ని రిజెక్ట్ చేసిందని అంటున్నారు. దాంతో ఆమె స్థానంలో కృతిశెట్టి ని ఎంపిక చేసుకున్నారట. ఇంతకీ చైతు కస్టడీ మూవీ ని రిజెక్ట్ చేసిన హీరోయిన్ మరెవరో కాదు.. మన నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కస్టడీ మూవీ యూనిట్ ముందుగా హీరోయిన్ పాత్ర కోసం రష్మిక మందనను సంప్రదించగా.. సినిమాలో హీరోయిన్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉందని ఆమె రిజెక్ట్ చేసిందట.

నిర్మాతలు రెమ్యూనరేషన్ ఆశ చూపించినా కూడా ఆమె ఒప్పుకోలేదని టాక్ వినిపిస్తోంది. దాంతో ఆమె ప్లేస్ లో కృతి శెట్టి ని తీసుకున్నారు. గతంలో చైతు, కృతిశెట్టి కాంబినేషన్లో వచ్చిన 'బంగార్రాజు' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అవ్వడంతో మరోసారి చైతూ కి జోడిగా కృతి శెట్టిని మూవీ టీం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక కస్టడీ మూవీలో నాగచైతన్య కానిస్టేబుల్ శివ పాత్రలో నటించగా.. అతడి ప్రేయసిగా కృతి శెట్టి రేవతి రోల్ లో కనిపించింది. అలాగే కోలీవుడ్ అగ్ర నటుడు అరవింద్ స్వామి ఈ సినిమాలో విలన్ రోల్ పోషించాడు. ఇక మొదటి ఆట నుండే డివైడ్ టాక్ సొంతం చేసుకున్న ఈ బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: