దీంతో ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు దాదాపుగా రూ .30 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా రూ .25 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగింది. దీంతో ఈ సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ గ్రాండ్ గా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తాడు అనుకున్నారు. కానీ ఈ సినిమా విడుదలయ్యాక ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది.. చత్రపతి సినిమా బాలీవుడ్ లో మే 12వ తేదీన దాదాపుగా 2300 స్క్రీన్ లలో విడుదల అవ్వగా.. మొదటి రోజు ఈ సినిమాకు ఇండియా ఓవర్సీస్ కలుపుకొని దాదాపుగా కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే రాబట్టింది.
ఇక రెండవ రోజు అయితే 80 లక్షల రూపాయలు గ్రాఫ్ కలెక్షన్ రాబట్టింది. దీంతో చిత్ర బృందమంతా ఆశ్చర్యపోయి ఏంటి ఇలా అయింది అంటూ ఆలోచిస్తున్నారు ఎన్నో ఆశలతో బెల్లంకొండ శ్రీనివాస్ గ్రాండ్గా బాలీవుడ్లోకి ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే కనీసం ఓపెనింగ్స్ లో కూడా ఇలా రాకపోవడంతో చిత్ర బృందం ఆశ్చర్యపోతున్నారు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్ల సైతం బెల్లంకొండ శ్రీనివాస్ ని ట్రోల్ చేస్తున్నారు.. చత్రపతి సినిమా డిజాస్టర్ అవ్వడంతో నిర్మాతలకు భారీ నష్టం.. దీంతో కింది చత్రపతి సినిమా ఖర్చులకు కూడా రికవరీ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.