ఎన్టీఆర్, ఏఎన్నార్ తరం నాటి హీరోయిన్ జయసుధ.. గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోయిన్గా ఎంతోమంది స్టార్ల సరసన నటించిన జయసుధ తన నటనతో సహజనటిగా పేరు సంపాదించుకుంది. ఇక ఎలాంటి పాత్రలోనైనా సరే పరాకాయ ప్రవేశం చేసి పాత్రకు ప్రాణం పోస్తూ ఉండేవారు జయసుధ. దీంతో దర్శకులు అందరూ కూడా జయసుధ కోసమే ప్రత్యేకమైన పాత్రలు రాసుకునేవారు అనడంలో అతిశయోక్తి లేదు. మొదటి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి స్టార్ హీరోలతోనే కాదు నిన్నటి తరం హీరో అయిన చిరంజీవి లాంటి హీరోల సరసన కూడా నటించింది.




 ఇక జయసుధ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి హీరోలకు తల్లి పాత్రలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది అని చెప్పాలి. కేవలం తల్లి పాత్రలు మాత్రమే కాదు హీరోలకు బామ్మ పాత్రల్లో కూడా నటిస్తోంది. ఇలా కొన్ని దశాబ్దాల నుంచి సినీ ప్రేక్షకులు అందరిని అలరిస్తూనే ఉంది అని చెప్పాలి. ఇకపోతే గతంలో ఒక ఇంటర్వ్యూలో జయసుధ చేసిన వ్యాఖ్యలు కాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి. ఏకంగా ఒక హీరోయిన్ ను చెప్పుతో కొట్టినట్లు ఇంటర్వ్యూలో జయసుధ గుర్తు చేసుకున్నారు. జయసుధ హీరోయిన్గా కృష్ణంరాజు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో కటకటాల రుద్రయ్య అనే సినిమా వచ్చింది.



 ఇక ఈ సినిమాలో జయచిత్ర కూడా మరో హీరోయిన్. అయితే ఇందులో ఒక సన్నివేశం జరిగిందట. ఈ సినిమాలో నేను ఒక హీరోయిన్.. అయితే మరో హీరోయిన్ జయచిత్ర.. అయితే మా ఇద్దరి మధ్య చెప్పుల విషయంలో గొడవ జరిగింది.  నేను హై హీల్స్ వేసుకోవడం జయచిత్రకి అస్సలు నచ్చడం లేదు. దాంతో చెప్పులు విప్పేసి రా అని నా మొహం మీదే చెప్పింది. ఆమె కోసం నేను హీల్స్ వేసుకోకుండా ఉండడమేంటి అని నాకు అనిపించింది. నేను విప్పను అని చెప్పి పక్కకు వెళ్ళిపోయా. ఇక అదే మనసులో పెట్టుకున్న జయచిత్ర షూటింగ్లో మేమిద్దరం కొట్టుకునే సన్నివేశంలో నన్ను గట్టిగా కొట్టింది. నేను కూడా ఊరుకోకుండా ఆ హీరోయిన్  ను నిజంగానే గట్టిగా చెప్పుతో కొట్టా. కానీ ఈ సన్నివేశం మాత్రం బాగా పండింది అంటూ జయసుధ చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: