వైజయంతి బ్యానర్ లో ఒక సినిమా వస్తుంది అంటే దానికి చేసే ప్రమోషన్స్ వెరైటీ గా ఉంటాయి. మహానటి సీతారామం సినిమాల తర్వాత స్వప్న సినిమాస్, వైజయంతి బ్యానర్ నుంచి వస్తున్న సినిమా అన్నీ మంచి శకునములే. సంతోష్ శోభన్ హీరో గా మాళవిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారీ కాస్టింగ్ తో తెరకెక్కింది. రేపు రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ముందు రోజు వరకు ప్రమోషన్స్ చేస్తూనే ఉన్నారు. ఫలితాల తో సంబంధం లేకుండా సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

సినిమా గురించి నందిని రెడ్డి చాలా స్పెషల్ గా చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ చాలా చాలా బాగుంటుందని అంటున్నారు. ఈ సినిమా క్లైమాక్స్ తన సినిమాల్లో బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పారు నందిని రెడ్డి. సినిమాలో కాస్టింగ్ అంతా బాగా సెట్ అయ్యిందని ఎవరికి వారు వారి పాత్రలకి పూర్తి స్థాయి లో నాయం చేశారని అన్నారు. సంతోష్ శోభన్ ఈ సినిమాతో పక్కా హిట్ కొట్టాలని చూస్తున్నారు.

ఈ సినిమాలో మ్యూజిక్ మెయిన్ హైలెట్ అవుతుందని. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ సినిమాకు ది బెస్ట్ ఇచ్చారని అన్నాఉ నందిని రెడ్డి. ఓ బేబీ తర్వాత నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని చేసిన ఈ సినిమా మీద పూర్తి నమ్మకంగా ఉన్నారు నందిని రెడ్డి. అన్నీ మంచి శకునములే తో నందిని రెడ్డి తన సత్తా చాటుతారా లేదా అన్నది చూడాలి. ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. మరి సినిమా ఏమవుతుందో చూడాలి. సంతోష్ శోభన్, మాళవిక తమ నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారని అంటున్నారు. సినిమా హిట్ అయితే వైజయంతి బ్యానర్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే.


మరింత సమాచారం తెలుసుకోండి: