బండ్ల గణేష్ మాట్లాడితే పవన్ ని దేవర దేవర అని పిలుస్తూ సోషల్ మీడియాలో మెసేజ్ లు వేస్తుంటాడు. దేవర ఇదేదో టైటిల్ బాగుంది కదా పవన్ తోనే సినిమా చేసేయ్ గురూ అని పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉత్సాహం చూపించారు. అలానే బండ్ల గణేష్ దేవర టైటిల్ రిజిస్టర్ కూడా చేయించాడు. పవన్ చేస్తున్న సినిమాకు దేవర టైటిల్ పెడతారని అనుకున్నారు తీరా ఫైనల్ ట్విస్ట్ ఏంటంటే ఆ టైటిల్ ఇప్పుడు ఎన్.టి.ఆర్ కు వెళ్లిందట. ఎన్.టి.ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న సినిమాకు టైటిల్ గా దేవర అనే ఫిక్స్ చేశారట.
దేవర ఒక మంచి పవర్ ఫుల్ టైటిల్ ఆ టైటిల్ పవన్ కళ్యాణ్ ఎలా వదిలేశాడబ్బా అని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే బండ్ల గణేష్ దగ్గర ఉన్న ఆ టైటిల్ తారక్ కి ఇచ్చినట్టు తెలుస్తుంది. రేపు ఎల్లుడులో ఎన్.టి.ఆర్ 30 టైటిల్ ఎనౌన్స్ మెంట్ రాబోతుంది. దేవర టైటిల్ తో ఎన్.టి.ఆర్ ఇది దైవ నిర్ణయమే అని సైలెంట్ గా ఉన్నా బండ్ల గణేష్ కావాలనే ఎన్.టి.ఆర్ కి ఆ టైటిల్ ఇచ్చాడా లేక ఆ పవన్ మీద కోపం తో ఇచ్చాడా అని చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా పవన్ ఎన్.టి.ఆర్ ల మధ్య ఈ టైటిల్ హంగామా ఫ్యాన్స్ ని కన్ ఫ్యూజ్ చేసిందని చెప్పొచ్చు.