అలాంటి అవకాశం కోసం ఎంతో మంది సినిమా ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉండేవారు.అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే.
తమిళంలో అగ్ర కథానాయకగా దూసుకుపోతున్న జయలలిత తెలుగులో కూడా చాలా సినిమాలో నటించారు.
కానీ అందరు హీరోయిన్స్ తో పోలిస్తే జయలలిత కాస్త భిన్నమైన వైఖరితో ఉంటారు.ఆమె రూటే సపరేట్.జయలలిత సినిమా లో నటించాలంటే కేవలం కథ మాత్రమే కాదు, హీరోని బట్టి కూడా ఆమె ఆ చిత్రాన్ని చెయ్యాలా వద్దా అని ఆలోచించే వారట.
ఒకవేళ గనుక సినిమా కథ నచ్చిన హీరో నచ్చకపోతే ఆమె ఆ సినిమాను చేయడానికి ఒప్పుకునే వారు కాదు.అందుకే పారితోషకం తో సంబంధం లేకుండా ఆమె కొన్ని సినిమాల్లో, కొంత మంది హీరోలతో నటించలేదు.
ఉదాహరణకు తమిళనాడు లో శివాజీ గణేషన్ కి మంచి పేరుంది.కానీ ఆయన పక్కన ఒకటి లేదా రెండు సినిమాల్లో మాత్రమే నటించారు.
ఇక తెలుగులో కూడా అక్కినేని వంటి హీరోతో చేయడానికి ముందుకు రాలేదు.అందుకు గల కారణం అక్కినేని హైట్ అని అప్పట్లో అందరూ గుసగుసలాడారు.ఎందుకంటే ఆమె పక్కన నటించే హీరో ఖచ్చితంగా మంచి అందగాడు అలాగే హైట్ వెయిట్ అన్ని బాగుండాలి.
లేదంటే తన ఫాన్స్ ఫీల్ అవుతారని ఆమె అలా చేశారట.అప్పట్లో జయలలితకు అభిమాన సంఘాలు ఎక్కువగా ఉండేవి.వాటిని ఆమె పెంచి పోషించేవారు.
ఆమెతో పాటు సావిత్రి లాంటి వారు కూడా ఎక్కువగా అభిమాన సంఘాలను మెయింటైన్ చేసేవారు.తన అభిమానులు అక్కినేని వంటి షార్ట్ హీరోతో నటిస్తే నచ్చుకుంటారని అతనితో నటించడానికి ఓకే చేయలేదు జయలలిత.