సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల పై రూమర్లు రావడం సహజమే.. అయితే ఈ రూమర్లు కొంతమందిని మరింత బాధ పెడుతున్నాయని చెప్పాలి.. ఈ క్రమంలోనే తాజాగా తమన్నా పై వస్తున్న రూమర్లకు ఆమె మరింత బాధపడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా గత 18 సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీలో నిర్విరామంగా సక్సెస్ బాట పట్టిన తమన్నా గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని సంవత్సరాల కాలంలో ఆమె ఒక్క రూమర్ కూడా మోయలేదు అంటే ఇక ఆమె ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో అర్థమవుతోంది. అలాంటి ఈమెపై ఈ ఏడాది భారీగా రూమర్స్ సృష్టిస్తున్నారని చెప్పాలి.

ఏడాది మొదట్లో ప్రముఖ బాలీవుడ్ హీరో విజయవర్మతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆమె తనదైన శైలిలో ఖండించింది. అయితే ఇప్పుడు మరొకసారి బాలయ్య సినిమాపై వస్తున్న వార్తలపై కూడా ఆమె ఖండించింది. ఇకపోతే తాజాగా వస్తున్న వార్తలు ఏమిటంటే.. అనిల్ రావిపూడి, బాలయ్య కాంబినేషన్లో వస్తున్న ఎన్బికె 108 చిత్రంలో ఐటమ్ సాంగ్ ఉందని.. అందులో ఐటెం సాంగ్ కోసం తమన్నాను సంప్రదించగా ఆమె కోటిన్నర రూపాయలు అడిగినట్లు.. దానికి నిర్మాతలు నో చెప్పినట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా ఈ వార్తలపై ఖండించింది తమన్నా.

తమన్నా మాట్లాడుతూ.." నేను అనిల్ రావిపూడి గారితో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను ఇక నందమూరి బాలకృష్ణ గారు అంటే నాకు చాలా గౌరవం.. అయితే ఎలాంటి ఆధారాలు లేని వార్తలు నాపై రాస్తూ నన్ను మరింత ఇబ్బంది పెడుతున్నారు. ఎలాంటి ఆధారాలు లేని ఒక వార్తను రాసే సందర్భంలో నిందలు వేసేటప్పుడు నిజాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి.. ఇక బాలకృష్ణ గారి కొత్త సినిమాలో నాకు ఎలాంటి అవకాశాలు రాలేదు.. దయచేసి అర్థం చేసుకోండి"  అంటూ తన బాధను వ్యక్తం చేసింది తమన్నా. ప్రస్తుతం ఈమె మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ తో పాటు రజనీకాంత్ జైలర్ చిత్రంలో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: