ఈమే నటుడు నరేష్ తో కలిసి రిలేషన్ లో ఉంటున్న సంగతి మనకు తెలిసిందే.ఓ సినిమా షూటింగ్లో భాగంగా వీరిద్దరూ కలిసి నటించారు కూడా.అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో నే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారడం జరిగిందటా.ఇలా ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండడం తో ఇద్దరు కలిసి రిలేషన్ లో ఉంటున్నారని తెలుస్తుంది.
ఇక నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా మళ్ళీ పెళ్ళి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా మే 26వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారట.. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పవిత్ర లోకేష్ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను అయితే తెలియజేశారు. అలాగే నరేష్ తో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా ఈమె క్లారిటీ ఇచ్చారని తెలుస్తుంది.ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ నరేష్ తనకు పార్ట్నర్ మాత్రమే కాదని తనకు ఎంతో సపోర్ట్ సిస్టం కూడా అంటూ కామెంట్స్ చేశారు. ఆయన ప్రతి విషయంలో తనకు ఎంతో అండగా నిలబడ్డారని,ప్రతి విషయంలోనూ తన సపోర్ట్ నాకు బాగా అందిస్తున్నారని తెలియజేశారు. ఇక నా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ కూడా ఎదురయ్యాయి అయితే ఈ వార్తలు వచ్చినప్పుడు తనకు చాలా బాధ కలిగిందని ఆ సమయంలో నరేష్ ఎంతో అండగా నిలచారు అంటూ ఈ సందర్భం గా పవిత్ర చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.