ఈ సినిమా కూడా బొగ్గు గనుల నేపథ్యంలోనే తెరకెక్కించడం జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తోంది. కన్నడ హీరో కూడా ఈ చిత్రంలో విలన్ గా నటించబోతున్నారు. కానీ వినిపిస్తున్న బస్సు ప్రకారం సలార్ సినిమా లో బిగ్గెస్ట్ బెస్ట్ క్యాస్టింగ్ ఉందని దాదాపుగా 15 మంది ప్రముఖ నటీనటులు సైతం నటిస్తున్నారని.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సరైన స్క్రిప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కించినట్లు అయితే కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని సినీ విశ్లేషకులు సైతం తెలియజేస్తున్నారు. ఒక వేళ ఇదే కనుక నిజమైతే కచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను మరొకసారి తిరగరాస్తుందని చెప్పవచ్చు.
ప్రభాస్ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారని చెప్ప వచ్చు ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఫోటోలు, వీడియోలు , లీకైన ఫోటోలు వీడియోలు సైతం ఈ సినిమాకు మంచి భజ్ ను తీసుకొస్తున్నాయి. ప్రభాస్ ఇవే కాకుండా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఒకటి.. నాగ్ అశ్విన్ తో ప్రాజెక్టుకే, స్పిరిట్ అనే చిత్రంతోపాటు పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సలార్ చిత్రం ఈ ఏడాది చివరి కల్లా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ సినిమాకు సంబంధించి ఈ విషయం మాత్రం తెగ వైరల్ గా మారుతోంది.