చాలాకాలం తర్వాత థియేటర్లో ఒక మంచి సినిమాను చూసి ఎంజాయ్ చేశానని ఈ అబ్బాయి సుమంత్ కోసం ఈ సినిమా చూడొచ్చు అంటూ నటుడుగా డైరెక్టర్గా సుమంత్ కి మంచి భవిష్యత్తు ఉంది అన్ని పాత్రలు కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు నటీనటులు కూడా చాలా సహజంగానే కనిపించారు. ముఖ్యంగా అంజి మామ క్యారెక్టర్ ఇందులో హైలెట్ గా ఉంది అంటూ యువతను ప్రోత్సహించాలి.. ధమ్ ధమ్ చేయకూడదు అంటూ రాజమౌళి ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
ఈ సినిమా విడుదలకు ముందు మహేష్ బాబు కూడా తన ట్విట్టర్ల ఈ సినిమా గురించి ప్రస్తావించడం జరిగింది. మేము ఫేమస్ సినిమాను చూసాను చాలా అద్భుతంగా ఉందంటూ విచ్చేశారు హీరో డైరెక్టర్ నటీనటులు నటన కూడా అద్భుతంగా ఉందంటూ పొగిడేశారు. ఈ సినిమాకి విడుదలకు ముందే చాలామంది హీరోలతో ప్రమోట్ చేయించారు.. ఇక విడుదలైన తర్వాత హీరోలు డైరెక్టర్లు సైతం ఈ సినిమాని చూసి పొగిడేస్తూ ఉండడంతో మరింత హైప్ వస్తోంది. మరి కొంతమంది మాత్రం ఈ సినిమా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.నెగిటివిటీ ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా హిట్టు టాక్ తో ప్రస్తుతం దూసుకుపోతుంది.