ఈసంవత్సరం సమ్మర్ రేస్ టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్దగా కలిసిరాలేదు. ‘విరూపాక్ష’ మూవీ తప్ప మరే సినిమా హిట్ కాకపోవడంతో సమ్మర్ సినిమాలను నమ్ముకుని కోట్లు ఖర్చు పెట్టుకున్న బయ్యర్లు చాలమాటుకు నష్టపోయారు. ఇక జూన్ లో ప్రభాస్ ‘ఆదిపురుష్’ జూలైలో పవన్ కళ్యాణ్ ‘బ్రో’ ఆగష్టులో చిరంజీవి ‘భోళాశంకర్’ సినిమాలు తప్ప మరే భారీ సినిమాలు లేవు. దీనితో ఇండస్ట్రీ దృష్టి అంతా దసరా రేస్ పై ఉంది.



ఈదసరా రేస్ ఈసారి బాలకృష్ణ రవితేజాల రేస్ గా మారింది. బాలకృష్ణ అనీల్ రావిపూడిల మూవీతో రవితేజా ‘టైగర్ నాగేశ్వరరావు’ విడుదలకాబోతోంది. అయితే బాలయ్య రవితేజాతో పోటీపడుతున్న ప్రతి సందర్భంలోను బాలయ్య పై రవితేజా పట్టు సాధించిన సెంటిమెంట్ బాలయ్య అభిమానుల దృష్టికి రావడంతో వారు కలవర పడుతున్నట్లు టాక్.



2008 సంవత్సరంలో బాలకృష్ణ రవితేజ సినిమాలు ఒకేసారి థియేటర్లలోకి వచ్చాయి. రవితేజ నటించిన కృష్ణ బాలకృష్ణ చేసిన ‘ఒక్కమగాడు’ సినిమాలలో రవితేజా మూవీ సక్సస్ అయింది. తిరిగి అదే సంఘటన 2009లో కూడ రిపీట్ అయింది. బాలయ్య నటించిన మిత్రుడు’ రవితేజా నటించిన ‘కిక్’ సినిమాలు ఒకే నెలలో విడుదలైన సందర్భంలో మళ్ళీ బాలయ్య పై రవితేజా ఆదిపత్యం చెలాయించాడు.  


2011లో మళ్ళీ బాలకృష్ణ మూవీ ‘పరమవీరచక్ర’ రవితేజా ‘మిరపకాయ’ మూవీతో పోటీ పడినప్పుడు మళ్ళీ రవితేజా బాలయ్య పై సక్సస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు చాల సంవత్సరాల గ్యాప్ తరువాత బాలకృష్ణ రవితేజ సినిమాలు మరోసారి దసరా రేస్ లో ఒకదాని పై ఒకటి పోటీ పడుతున్నాయి. అయితే సెంటిమెంట్ ప్రకారం మళ్ళీ రవితేజా బాలయ్య పై తన ‘టైగర్ నాగేశ్వరరావు’ తో హిట్ కొట్టి సెంటిమెంట్ మళ్ళీ రిపీట్ చేస్తాడా అన్న భయాలు బాలయ్య అభిమానులను వెంటాడుతున్నట్లు టాక్. అయితే ఇప్పటివరకు ఫెయిల్యూర్ అన్నపదాన్ని ఎరగని అనీల్ రావిపూడి సినిమాలో బాలయ్య నటిస్తున్నాడు కాబట్టి ‘టైగర్ నాగేశ్వర రావు’ అంత సులువుగా సెంటిమెంట్ ను రిపీట్ చేయలేకపోవచ్చు అన్న ధైర్యంతో బాలయ్య అభిమానులు ఉన్నట్లు తెలుస్తోంది..


మరింత సమాచారం తెలుసుకోండి: