మలయాళంలో రూ.160 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులోకి డబ్ అయి ఘన విజయాన్ని సాధించింది. మంచి కలెక్షన్స్‌ను కూడా రాబడుతోంది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన థాంక్స్ మీట్‌లో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు.
''నేను అమెరికాలో ఉండగా బన్నీ వాసు ఫోన్ చేసి నాకు 2018 సినిమా గురించి చెప్పి.. దీన్ని గీతా ఆర్ట్స్‌లో విడుదల చేస్తే బావుంటుందని అన్నాడు. నేను చూడలేదు. కానీ నువ్వు మన గీతాలో చేస్తే బావుంటుందని అనుకుంటున్నావు కాబట్టి.. సినిమా నువ్వు చూసి నచ్చితే బన్నీ వాసు ను మన బ్యానర్ లో వెయ్ అన్నాను. ఇందులో ఓ చిన్న విషయం కూడా ఉంది. నేను కానీ, దిల్ రాజు వంటి సీనియర్స్ చేయాల్సిందేంటంటే.. జూనియర్స్‌కు మంచి స్పేస్ ను క్రియేట్ చేయాలి.
నెక్ట్స్ జనరేషన్‌కు ఓ స్పేస్ క్రియేట్ చేస్తే అందులో వాళ్లు కూడా ఎదుగుతారు. మనమే అంతా ఆక్రమించేసి, పేరు..డబ్బు మనకే వచ్చేయాలంటే అది అస్సలు కరెక్ట్ కాదు. నేను కూడా అది తెలివి తేటలుగానే గ్రహించి పక్కన వాళ్లకి స్పేస్ ఇవ్వాలి అనుకున్నాను. నా వ్యక్తిత్వం కూడా పక్కన వాళ్లకు కూడా స్పేస్ ఇచ్చేలాగానే ఉంటుంది. చందు మొండేటి సినిమా తీసి దాదాపు సంవత్సరం అయితే అయిపోయింది. ఆయన ఏ సినిమా తీయలేదు. ఎవరిదీ కూడా ఒప్పుకోలేదు. చాలా మంది వచ్చి కూడా టెంప్టింగ్ ఆఫర్స్ కూడా ఇచ్చారు. అది నాకు తెలుసు.
కానీ ఇంతకు ముందు సినిమా విడుదల కాక ముందే మాతో రెండు సినిమాలు చేయాలన్న కమిట్‌మెంట్ అయితే నాతో ఉంది. సినిమా విడుదల కాకముందే తను గొప్ప డైరెక్టర్ అని గ్రహించి నేను తనని బుక్ చేసుకున్నాను. చాలా మంది.. నేను పేర్లు చెప్పటం అయితే అనవసరం. నా ద్వారా పైకొచ్చిన వాళ్లలో చాలా మంది ఆ గీత దాటి వెళ్లి సినిమాలు చేసిన వాళ్లు కూడా ఉన్నారు… పరావాలేదు. కానీ చందు మొండేటి నా మాటకు నిలబడి పోయారు. ఎంత మంది ఏం చెప్పినా, నేను అరవింద్‌గారి సినిమా చేసిన తర్వాతే వేరే సినిమాను చేస్తానని ఆయన నిలబడ్డారు'' అని అరవింద్ గారు చెప్పుకొచ్చారు.