ఇండస్ట్రీని శాసించే ఆ నలుగురిలో దగ్గుబాటి సురేష్ బాబు కుటుంబం ఒకటి అన్నది ఓపెన్ సీక్రెట్. అలాంటి కుటుంబం నుండి ఒక హీరో వస్తున్నాడు అంటే చాల హడావిడి జరగాలి. అయితే ఎలాంటి హడావిడి లేకుండా సురేష్ బాబు రెండవ కొడుకు అభిరామ్ నటించిన ‘అహింస’ సినిమా విడుదల అవ్వడం ఆసినిమాకు ఫ్లాప్ టాక్ రావడం రెండు జరిగిపోయాయి.
సినిమా ఫ్లాప్ అయినప్పటికీ ఆసినిమాలో నటించిన హీరో బాగా నటించాడు అన్న పేరు వస్తే కొంతవరకు అయినా బాధ ఉండదు. అయితే ఈసినిమాలో అభిరామ్ నటన చూసి ఎటువంటి భావాలను పలికించడంలో ఫెయిల్ అయిన ఈ యంగ్ హీరోను ఏధైర్యంతో సురేష్ బాబు ఇండస్ట్రీకి పరిచయం చేసాడు అంటూ చాలామంది ఆశ్చర్యపోతున్నారు.
పాత చింతకాయ పచ్చడి లాంటి ఒక కథను దర్శకుడు తేజా చెపితే ఆ కథ పై ఎంతో అనుభవం ఉన్న సురేష్ బాబు ఎలా నమ్మగలిగాడు అంటూ మరి కొందరు షాక్ అవుతున్నారు. వాస్తవానికి అభిరామ్ హీరో అవ్వకముందే రకరకాల వివాదాలలో చిక్కుకోవడంతో అతడి ఇమేజ్ కొంతవరకు డామేజ్ అయింది. అలాంటి వ్యక్తిని హీరోగా చేసి ఒక సినిమా తీస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.
అలాంటి జాగ్రత్తలు ఏమి తీసుకోకపోవడంతో ‘అహింస’ సినిమాను చూసిన సగటు ప్రేక్షకుడు ఏమిటి ఈ హింస అంటూ తలపట్టుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సురేష్ బాబు రానా మొదటి సినిమా విషయంలో చాల జాగ్రత్తలు తీసుకున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తీసిన ‘లీడర్’ మూవీ మంచి విజయాన్ని సాధించింది. అలాంటి జాగ్రత్తలు సురేష్ బాబు అభిరామ్ విషయంలో తీసుకోకపోవడంతో ఈ యంగ్ హీరో పరిస్థితి ఏమిటి అంటు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అభిరామ్ సినిమా ఫెయిల్యూర్ ను బట్టి సినిమా సక్సస్ అవ్వాలి అంటే బ్యాగ్రౌండ్ కంటే సినిమా కంటెంట్ ముఖ్యమని మరోసారి ఇండస్ట్రీ వర్గాలకు తెలిసి వచ్చేలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు అయింది..
ReplyForward |