టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. సీనియర్ స్టార్ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ చేస్తోన్న మూడో మూవీ ఇది. అందువల్ల ఈ మూవీపై అభిమానుల్లో ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాని కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికే ఈ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా అంచనాలను పెంచేయగా.. రీసెంట్ గా మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ అండ్ గ్లింమ్స్ ఆ సినిమాని అంచనాలను ఆకాశానికి చేర్చాయి. అతడు, ఖలేజా మూవీల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న కావడంతో ఈ మూవీపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరిగుతోంది. ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ సరసన పూజాహెగ్డే ఇంకా శ్రీలీల నటిస్తున్నారు.


ఇదిలా ఉంటే ఈ మూవీని ముందుగా త్రివిక్రమ్ మరో హీరో కోసం అనుకున్నారంటు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. గుంటూరు కారం ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తెరకెక్కించాలని అనుకున్నారట త్రివిక్రమ్. కానీ తారక్ వరుస సినిమాలతో బిజీ అవ్వడంతో మహేష్ తో ఈ సినిమా చేస్తున్నారంటూ ఓ వార్త ఫిలిం నగర్ లో వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని త్రివిక్రమ్ గుంటూరు కారం కథను మహేష్ కోసమే రెడీ చేశాడని అంటున్నారు పలువురు.త్రివిక్రమ్ శ్రీనివాస్ తారక్ తో కలిసి అరవింద సమేత అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత తారక్ తో గురూజీ సినిమా ఉండే అవకాశం ఉందని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: