ఈ రెండు సినిమాలు బాలయ్య మార్కెట్ ని బాగా మార్చేసింది. 'అఖండ' కి ముందు బాలయ్య మార్కెట్ 30 కోట్ల రూపాయిలు వరకు అయితే ఉండేది. కానీ అఖండ తర్వాత ఆయన మొదటి రోజు వసూళ్లే 30 కోట్ల రేంజ్ లో అయితే వస్తున్నాయి. ఈ స్థాయి ఎదుగుదల రీసెంట్ టైం లో ఏ హీరో కి కూడా లేదు . 'అన్ స్టాపబుల్ విత్ NBK' టాక్ షో కూడా బాలయ్య బాబు కి బాగా కలిసొచ్చిందని చెప్పాలి.. ఈ టాక్ షో తర్వాత ఆయన యూత్ ఆడియన్స్ ని కూడా ఎంతగానో మెప్పించాడు.. ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావిపూడి తో 'భగవత్ కేసరి( Bhagath kesari )' అనే సినిమా చేస్తున్నాడు.
తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై మంచి రెస్పాన్స్ ని అయితే దక్కించుకుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, శ్రీలీల ఒక ముఖ్యపాత్రలో కనిపిస్తుందని సమాచారం.. బాలయ్య బాబు కి కూతురుగా ఆమె నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమా తర్వాత బాలయ్య ఏ సినిమా చెయ్యబోతున్నాడు అనే దానిపై సోషల్ మీడియా లో అనేక వార్తలు కూడా వినిపించాయి. బోయపాటి శ్రీను తో ఒక సినిమా చెయ్యబోతున్నాడు అని ప్రచారం అయితే సాగింది. బోయపాటి తో నిజంగానే ఒక సినిమా అయితే ఖరారు అయ్యింది. కానీ అది ఈ చిత్రం తర్వాత ఉండదని తెలుస్తుంది. బాలయ్య కి తనకి 'చెంగిస్ ఖాన్' బయోపిక్ లో నటించాలని ఉందంటూ తన మనసులోని కోరికను చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన ఆ మాట చెప్పినప్పటి నుండి చెంగిస్ ఖాన్ కి సంబంధించిన విషయాలన్నీ పరిశోధించి, ఒక అద్భుతమైన స్క్రిప్ట్ ని కూడా సిద్ధం చేసాడట ప్రముఖ డైరెక్టర్ బి.గోపాల్, ఈయన గతం లో బాలయ్య బాబు తో రౌడీ ఇన్స్పెక్టర్, సమరసింహా రెడ్డి మరియు నరసింహ నాయుడు వంటి సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించిన విషయం అందరికీ తెలిసిందే. గత కొంత కాలం నుండి సినిమాలకు దూరం గా ఉన్న బి గోపాల్,బాలయ్య తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని చెయ్యడానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం.. ఇటీవలే బాలయ్య బాబు ని కలిసి ఫైనల్ నెరేషన్ ఇచ్చాడట గోపాల్.బాలయ్య కి అది ఎంతో బాగా నచ్చిందని సమాచారం..ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంబించుకో డేట్స్ ఇచ్చేస్తాను అని కూడా అన్నాడట. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ వెయ్యి కోట్ల రూపాయిలు బడ్జెట్ పెట్టి నిర్మించడానికి సిద్ధంగా వున్నారని సమాచారం.