ఈ సినిమా దెబ్బకు మలయాళ సినిమా ఇండస్ట్రీ రికార్డులన్నీ కూడా బద్దలయ్యాయని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ బ్యానర్-2 బన్నీ వాసు మే 26న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేశారు. మొదటిరోజు ఈ సినిమా కోటికపైగా కలెక్షన్లు సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఓటీటిలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అంటు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లీవ్ సొంతం చేసుకున్నది.ఈ చిత్రాన్ని జూన్ ఏడవ తేదీన స్ట్రిమింగ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇక మరొక చిత్రం అవతార్-2 జేమ్స్ కామెరున్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం 3d చిత్రంలో విడుదల చేయడం జరిగింది. గతంలో టైటానిక్, టెర్మినేటర్, ఫిరణ -2 వంటి హాలీవుడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు ఈ డైరెక్టర్. 2009లో అవతార్ సినిమాని విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. కలెక్షన్ల పరంగా వరల్డ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. సినిమా విడుదలైన 234 రోజుల తర్వాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈరోజే స్ట్రిమింగ్ కాబోతోంది... ఈ రెండు చిత్రాల కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.