అందంతో మాయ చేస్తున్న ఈ బ్యూటీ ఫిట్నెస్ రహస్యాలకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నయనతార బరువు తగ్గడానికి, ఫిట్‌గా ఉండటానికి కారణం జిమ్ వర్కౌట్స్, యోగా ముఖ్య కారణాలు. నయన్ క్రమం తప్పకుండా యోగా చేస్తారట. రోజూ రెండు గంటలు యోగా చేస్తుందట. అలాగే ఈమె డైట్లో కచ్చితంగా కొబ్బరినీళ్లు ఉండాల్సిందేనట. ఉదయం అల్పాహారంలో పళ్ల రసం తప్పనిసరి. పళ్లరసం బరువును తగ్గించడంతోపాటు ఎనర్జీ పెరగడానికి దోహదపడుతుంది.
ఇక మధ్యాహ్నం భోజనంలో మాంసాహారం, గుడ్డు, కాయగూరలు సమపాళ్లలో తీసుకుంటుంది. ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ కలిగిన పదార్థాలకు దూరంగా ఉంటారట. ఇక సరైన నిద్ర కూడా మన బరువును అదుపులో ఉంచుతుంది. నయన్ రోజుకు 8 గంటలు నిద్రపోయేలా తన షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకుంటారట. నయనతార కొంతకాలం పాటు నటనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసిన తరువాత, కొంతకాలం పాటు సినిమాలను పక్కన పెడుతుందని అంటున్నారు.
పిల్లల ఆలనా పాలన స్వయంగా చూసుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందని సమాచారం. ఇక నయనతార కొంతకాలం పాటు నటనకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలను పూర్తిచేసిన తరువాత, కొంతకాలం పాటు సినిమాలను పక్కన పెడుతుందని అంటున్నారు. పిల్లల ఆలనా పాలన స్వయంగా చూసుకోవడం కోసమే ఆమె ఈ నిర్ణయాన్ని తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.