పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూన్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో ఆత్రుతగా కొన్ని వేలసార్లు అడిగిన సమాధానం లేని ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు ప్రభాస్.ఇక ఆ ప్రశ్న మరేదో కాదు ఆయన పెళ్లి. కెరియర్ పరంగా ఎవ్వరూ అందుకోలేనంత ఎత్తులో ఉన్న ప్రభాస్ తెలుగు నాటకం మొదలైన ఆయన ప్రస్థానం ఇప్పుడు ప్రపంచ స్థాయిని అందుకుంది. ఈ విధంగా ఆయన ఇంత ఎత్తుకి ఎదగడం వల్లే ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఎప్పుడూ ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తారు. 

ఇక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ పెళ్లి చేసుకుంటే చూడాలని ఆయన అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కల అది. అయితే తాజాగా నిన్న సాయంత్రం తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ పెళ్లి గురించి ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. ఇక ఆ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ పెళ్లి ఎప్పుడు అంటూ గోలగోల చేసారు. ఇక వారి ప్రశ్నకి స్పందించిన ప్రభాస్ పెళ్లి త్వరలోనే తిరుపతిలోనే చేసుకుంటా అంటూ సమాధానమిచ్చాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి.

దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ ఖచ్చితంగా త్వరలోనే పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు అనేది కచ్చితంగా చెప్పలేము కానీ త్వరలోనే ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది.అయితే ఇలాంటి ప్రశ్న వచ్చిన ప్రతిసారి త్వరలోనే అంటూ ప్రభాస్ ఆ ప్రశ్నను దాటేస్తూ ఉంటాడు. ఆ ప్రశ్న కామన్ అయిపోయింది .కానీ ఈసారి మాత్రం ప్రభాస్ అలా చేయకుండా త్వరలోనే తిరుపతిలోనే చేసుకుంటాను అంటూ చెప్పడంతో ఫాన్స్ అందరు ఈసారైనా చెప్పింది నిజం చేస్తాడా లేక ఎప్పటిలాగే ఈ ప్రశ్నని దాటేస్తాడా అని చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: