తెలుగులో ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే మారిపోయింది.అభిమానులు వాళ్ళ అభిమాన హీరో కొత్త సినిమాల కంటే కూడా రీ రిలీజ్ చిత్రాలకు ఎక్కువగా నే సంబరాలను చేసుకుంటున్నారు.

ఈ తరం అభిమానులు తమ హీరోల పాత సినిమాలు థియేటర్స్ లో చూసి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ రీ రిలీజ్ ట్రెండ్ ని ఒక రేంజ్ లో అయితే ప్రోత్సహిస్తున్నారు.

ఇప్పటికే మన స్టార్ హీరోలందరి సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం టాప్ 1 స్థానం లో కొనసాగుతుందని సమాచారం.. ఈ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ప్రయత్నాలు చేసారు కానీ, అది సాధ్యపడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ని పవన్ కళ్యాణ్ బద్దలు కొట్టడానికి రంగం లోకి దిగబోతున్నాడని తెలుస్తుంది.

ఈ ఏడాది సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గుడుంబా శంకర్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారని సమాచారం . ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన రీ మాస్టరింగ్ కార్యక్రమాలు నేడు ప్రారంభం అయ్యాయని సమాచారం.. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం తో, 4K HD క్వాలిటీ తో ఈ చిత్రం మన ముందుకు రాబోతుందని సమాచారం.

ఎప్పుడూ చూడని రీతిలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నాడటా నాగబాబు, ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తుంది.. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి సందడి వాతావరణం ఉంటుందో, ఈ రీ రిలీజ్ కూడా అలా ఉండబోతుందని సమాచారం.మరి ఈ చిత్రం ‘ఖుషి ‘ రికార్డుని బద్దలు కొట్టబోతుందో లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: