ప్రముఖ నటి యాంకర్ గా పేరు పొందింది అనసూయ గత కొద్దిరోజుల ముందు నుంచి హీరో విజయ్ దేవరకొండ ను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పలు రకాల ఫోటోలు చర్చనింశంగా మారాయి.THE అని పెట్టుకోవడానికి తప్పుపడుతూ పైత్యం ఎక్కువైంది అంటూ అనసూయ ట్విట్ చేయడం జరిగింది.. దీనిపై విజయ్ దేవరకొండ స్పందించకపోయిన అతని అభిమానులు మాత్రం చాలా ఫైర్ అయ్యారు. దీంతో అనసూయ పైన పలు రకాలుగా ట్రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత మధ్యలో డైరెక్టర్ హరిశంకర్, సాయి రాజేష్ వంటి వారు కూడా THE అనే పదాన్ని ప్రస్తావిస్తూ నెట్టింట పోస్టులు చేయడం జరిగింది.

వీటికి నటి రిప్లై ఇవ్వడంతో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. అయితే విజయ్ దేవరకొండ తో విభేదాల పైన అనసూయ డైరెక్ట్ గా స్పందించలేదు. కానీ మొదటిసారి ఈ వ్యవహారం పైన ఓపెన్ అయ్యింది.. గతంలో విజయ్ తనకు మంచి స్నేహితుడని కానీ కొన్ని పరిస్థితుల వల్ల తమ వద్ద విభేదాలు వచ్చాయని తెలియజేసింది అలాగే ఇకపై విజయ్ పై ట్విట్ట్లు చేయనని కూడా తెలియజేసింది.. విజయ్ దేవరకొండ తో నాకు ఎంతో కాలం నుంచి పరిచయం ఉంది మేమిద్దరం మంచి స్నేహితులము ఆయన హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో కొన్ని అభ్యంతర పదాలను మ్యూట్ చేశారు.

అయితే ఈ సినిమా రిలీజ్ అయిన సమయంలో థియేటర్ కు వెళ్లిన విజయ్ అక్కడ అభిమానులతో ఆ పదాలను పలికించారు. ఒక మహిళగా తనకి చాలా బాధించింది.. ఇలాంటివి ఎంకరేజ్ చేయవద్దని విజయ్ తో  చెప్పగా..అప్పటినుంచి తన పైన ట్రోలింగ్ స్టార్ట్ అయింది అంటూ తెలిపింది.అయినా నేను విజయ్  తో నిర్మించిన మీకు మాత్రమే చెబుతా సినిమాలో నటించాను విజయ్ కు సంబంధించిన ఒక వ్యక్తి తనను ట్రోల్ చేయడం పలువురికి డబ్బులు ఇస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోయానని తెలిపింది. ఇదంతా విజయ్ కు తెలియకుండానే జరుగుతోందా అనిపించింది అని అందుకే విజయ్ తనను ద్వేషిస్తున్నాడో లేదో తెలియదు అయితే నేను మాత్రం ఇక్కడితో దీన్ని ఆపేయాలనుకుంటున్నానని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: