కోలీవుడ్ , టాలీవుడ్లో స్టార్ హీరోగా పేరుపొందిన కమలహాసన్ చివరిగా విక్రమ్ సినిమాతో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వం వహించారు. ఇప్పుడు తాజాగా స్టార్ హీరో విజయ్ దళపతి తో లియో చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడం జరుగుతోంది .ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.


సినిమా ప్రకటించిన సమయంలోనే ఈ సినిమా పైన భారీ స్థాయిలో హైప్ రావడం జరిగింది.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారుతోంది.. హాలీవుడ్ స్టార్ క్రిస్టోఫర్ రూపొందించిన పేమెంట్ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించిన డేంజిల్  స్మిత్  ను లియో సినిమా కోసం సంప్రదించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని కీలకమైన పాత్ర కోసం ఆయనని ఎంపిక చేయడం జరిగిందట. దాదాపుగా కన్ఫామ్ అయినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.

లియో స్థాయిని రోజు రోజుకి పెంచేస్తున్న డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఈ చిత్రంతో ఈసారి  రూ.1000 కోట్ల క్లబ్లో చేరేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నట్టు తెలుస్తోంది కమలహాసన్తో లోకేష్ కనకరాజు తెరకెక్కించిన సినిమా దాదాపుగా రూ .500 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించింది. విజయ్ దళపతి చివరిగా వారసుడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. భారీ అంచనాల మధ్య ఎక్కిస్తున్న లియో సినిమా ఏ విధంగా ప్రేక్షకులను మెప్పించిందో చూడాలి మరి. విజయ్ రెమ్యూనరేషన్ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రస్తుతం లియో సినిమాకు సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: