బాలయ్య పుట్టినరోజు ఈరోజు కావడం చేత ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం. హైదరాబాద్ శ్రీ భ్రమరాంబ థియేటర్లో నందమూరి బాలయ్య భగవంత్ కేసరి టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు డైరెక్టర్ అనిల్ రావుపూడి పాల్గొనడం జరిగింది బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషి అయ్యేలా ఈ సినిమా ట్రైలర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలంగాణ యాసలో తెరకెక్కించడం జరిగింది.
ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే 1:15 సెకండ్ లో ఉన్న టీజర్ లో బాలయ్య మరొకసారి మాస్ హీరోగా చూపించడం జరిగింది. ఈసారి తెలంగాణ యాసలో చూపించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి హిందీ డైలాగులో కూడా తెలంగాణ యాసలో చెప్పించి బాలయ్య చేత అదరగొట్టేసారని చెప్పవచ్చు. ఈ డైలాగులు విన్న బాలయ్య అభిమానులు సైతం తెగ ఎంజాయ్ చేస్తున్నారు మాస్ బిజిఎం తో పాటు చివర్లో క్లాస్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది.. బాలయ్య చెప్పే డైలాగులు కూడా అదిరిపోయే విధంగా ఉన్నాయి ఈ సినిమా షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది తదితరులు సైతం నిర్మిస్తూ ఉన్నారు. విజయదశమి కానుకగా ఈ సినిమా గ్రాండ్గా విడుదల చేయబోతున్నారు.