అడవులు, గుహలు, చెట్లు, ఆకులు, కొమ్మలు, రాళ్లు రప్పల డిజైన్ వాడారు. లైటింగ్ కూడా ఆ థీమ్ కి తగ్గట్లుగా ఉంది. అక్కడక్కడా మోటివేట్ చేసేలా కొటేషన్స్ ఉన్నాయి. ఇక రామ్ గోపాల్ వర్మ కెరీర్లో ముఖ్య ఘట్టాలు, ప్రముఖులను కలిసిన సందర్భాలు, షూటింగ్ సెట్స్ లో తారలతో కూడిన ఫోటోలు అన్ని చోట్లా అమర్చారు. హిట్ ప్లాప్ అనే బేధం లేకుండా తన మనసుకు నచ్చిన చిత్రాలకు సంబంధించిన ఫోటోలు, పోస్టర్స్ ఆఫీస్ గోడలపై అమర్చారు. వర్మ నిర్మించిన చిత్రాల్లో జిఎస్టీ వంటి పూర్తి స్థాయి అడల్ట్ కంటెంట్ మూవీ కూడా ఉంది.
ఆ చిత్రాల తాలూకు స్టిల్స్ కూడా ఉన్నాయి. బట్టలు లేని బూతు బొమ్మలు వర్మ తన ఆఫీస్ లో ఏర్పాటు చేశాడు. వర్మను అభిమానించే వాళ్లకు ఆయన ఆఫీస్ పిచ్చగా నచ్చేస్తుంది. వీలైతే ఒకసారి విజిట్ చేయాలనే కోరిక కలుగుతుంది. ఇక వర్మ దగ్గర పని చేసే రైటర్స్ , డైరెక్టర్స్, టెక్నికల్ టీమ్ ని మనం ఆ వీడియోలో చూడొచ్చు. ఓ సాంగ్ కూడా ప్రత్యేకంగా రూపొందించాడు. వర్మ కొత్త ఆఫీస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ మధ్య వివాదాస్పద చిత్రాలు తగ్గించిన వర్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు. కొన్ని సామాజిక, పొలిటికల్ అంశాల మీద ప్రముఖులతో డిబేట్లు పెడుతున్నాడు. అలాగే వ్యూహం మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల కొన్ని స్టిల్స్ విడుదల చేశారు. అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.