టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా గత కొద్దిరోజుల క్రితమే తాను గర్భవతినయ్యానని విషయాన్ని తెలియజేయడం జరిగింది. అయితే ఈ బిడ్డకు తండ్రి ఎవరు ఇలియానా ఎవరిని వివాహం చేసుకుంది అనే విషయాలను మాత్రం చాలా పగడ్బందీగా ఉంచింది. అయితే ఈ నటి తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేయడం జరిగింది.ఇలియానా పోస్టులో తల్లి కావడం అనేది ఒక అపురూపమైన అనుభూతి అంటూ రాసుకొచ్చింది. ఇలాంటి ఆనందాన్ని నేను పొందుతున్నానని ఎప్పుడూ ఊహించుకోలేదంటూ తెలియజేసింది ఇలియానా.

ఈ ప్రయాణానికి నేను లక్ గా భావిస్తున్నానంటూ తెలియజేసింది. నాలో ఒక జీవి ప్రాణం పోసుకుంటే ఆ భావనను తలుచుకోవడం తనకు చాలా మధురంగా ఉంది అంటూ ఇంతకుమించి ఈ విషయాన్ని నేను వర్ణించలేకపోతున్నానని ఇలియానా తెలియజేసింది. చాలా రోజులు బేబీ బంప్ లో చూస్తూ ఉన్నానని త్వరలో నిన్ను కలవాలి అనుకున్నానని ఇలియానా తెలియజేయడం జరిగింది. కొన్ని కష్టమైన రోజులు ఉన్నాయి.. వాటి నుంచి బయటకు రావడానికి పలు రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నానంటూ తెలియజేయడం జరిగింది. కొన్ని పరిస్థితులు చాలా గందరగోళానికి గురిచేసాయి మరికొన్ని పరిస్థితులు నిస్సహాయతను కలిగించాయని ఇలియానా తెలియజేయడం జరిగింది.

చిన్న చిన్న విషయాలకు ఏడవకూడదని చాలా ధైర్యంగా ఉండాలని ఇలియానా తెలుపుతోంది పుట్టబోయే బిడ్డను కూడా ఎలా చూసుకుంటానో తెలియదు.. కానీ ఆ బిడ్డను అమితంగా ఇష్టపడుతున్నానని ఇలియానా తెలిపింది.. తన గురించి తాను మర్చిపోయిన రోజులలో తన ప్రియుడు తనకు అండగా నిలిచారని తెలిపింది. అతను నాలో ధైర్యాన్ని నింపాడని కన్నీళ్లను తుడిచి చిరునవ్వులు పూజించేలా చేశారు.. నాకు ఎప్పుడు ఏం కావాలో తెలుసని అతను నా చెంత నిలిచారని ఆమె తెలియజేసింది. ఇలియానా చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. సినిమాలలో మాత్రం కేవలం పరిమితంగానే నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో నైనా తన భర్త ఎవరనే విషయాన్ని తెలియజేస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: