టాలీవుడ్ హీరో రవితేజ వరుసగా గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య చిత్రంలో చిరంజీవి తమ్ముడు పాత్రలో అద్భుతంగా నటించి మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాలో నటించిన ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది.. అయితే ఓటీటిలో ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది.. ఇక దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.


స్టార్ కొరియోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాలో నటించబోతున్నారని చాలా కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈయన సూర్య వర్సెస్ సూర్య అనే చిత్రాన్ని నిఖిల్ తో తెరకెక్కించారు.. సినిమాటోగ్రాఫర్ గా బిజీగా ఉండడంవల్ల  దాదాపుగా 9 ఏళ్ల తర్వాత రవితేజతో అదిరిపోయి కాన్సెప్ట్ తో పాన్ ఇండియా మూవీని తెరకెక్కించబోతున్నారు. రవితేజ టీం నుంచి RT -73 అఫీషియల్ అప్డేట్ ఈ రోజున సాయంత్రం 6:03 గంటలకి ఉండబోతున్నట్లు తెలియజేశారు  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తూ ఉన్నారు.

తాజాగా ఈ సినిమా అప్డేట్ నుంచి ఒక వీడియో వైరల్ గా మారుతోంది.. ఆ వీడియోలో ఆ లావా కి ఒక పేరు ఉంది ఆ పేరుకి ఒక ప్రతి దాన్ని ఉంది ఆ ప్రతిధ్వని ఒక ప్రపంచం పుట్టిస్తుంది అనే లైన్ తో చూపించడం జరిగింది. ఈ సినిమా కూడా ఒక పీరియాడిక్ జోనర్లు తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది
 ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించబోతున్నట్లు సమాచారం.రవితేజ కెరియర్ లోని భారీ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రం ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు రవితేజ ఇలాంటి జోనర్లో టచ్ చేయలేదట. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: