టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇటీవల 'కార్తికేయ 2' తో ఏకంగా పాన్ ఇండియా హిట్ అందుకున్న ఈ హీరో ఇప్పుడు వరుస భారీ ప్రాజెక్ట్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇక ప్రస్తుతం నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ 'స్పై'. ఎడిటర్ గ్యారీ బిహెచ్ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈడి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి, చరణ్ ఉప్పలపాటి ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ మర్డర్ మిస్టరీని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందిస్తున్నారు. సినిమాలో నిఖిల్ ఓ స్పైగా కనిపించనుండగా, ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. ఆర్యన్ రాజేష్, మకరంద పాండే, సానియా ఠాకూర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. 

ఇక సినిమా ఈ నెల ఆఖరికి అంటే జూన్ 29కి రిలీజ్ అవుతున్నట్లు మూవీ టీం ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. కానీ ఇంతలోనే ఈ సినిమాకి ఓ ఊహించని సమస్య తలెత్తింది. తాజాగా హీరో నిఖిల్ - మూవీ నిర్మాత మధ్య మూవీ రిలీజ్ పై సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. జూన్ 29న ఈ సినిమా రిలీజ్ వద్దని నిఖిల్ అంటున్నాడు. ఎందుకంటే ప్రమోషన్ కు టైం సరిపోదు. కాబట్టి పోస్ట్ ఫోన్ చేస్తే బాగుంటుందనేది నిఖిల్ వాదన. కానీ నిర్మాత ఈక్వేషన్స్ వేరే విధంగా ఉన్నాయి. అవేంటంటే ఇదివరకు ప్రకటించిన రిలీజ్ డేట్ ఈ సినిమాను కచ్చితంగా రిలీజ్ చేయాలి. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఒకవేళ మూవీ రిలీజ్ కనుక వాయిదా పడితే అమెజాన్ తో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం నిర్మాతకు భారీగా నష్టం వస్తుంది. అందుకే విడుదల వాయిదా వేయడానికి నిర్మాత మాత్రం అంగీకరించడం లేదు.

తాజాగా ఈ మూవీ నుంచి ఓ సాంగ్ కూడా విడుదలైంది. ఆ సాంగ్ లో కూడా జూన్ 29న థియేటర్స్లోకి వస్తున్నామంటూ ప్రకటించారు. ఇంతలోనే నిర్మాత, హీరో మధ్య గొడవలు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అవుతుంది. ఆఖరి నిమిషంలో నిఖిల్ నిర్మాతలకు తలనొప్పులు తెచ్చి పెడతాడని అతనిపై ఎప్పటినుంచో టాక్ ఉంది. సినిమా బిజినెస్ గురించి, నిర్మాతల గురించి నిఖిల్ ఏమాత్రం ఆలోచించకుండా కేవలం తన సొంత ప్రయోజనాలకే ఇంపార్టెన్స్ ఇస్తాడంటూ గతంలో నిఖిల్ పై అనేక రకాల కథనాలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి కూడా స్పై మూవీ రిలీజ్ విషయంలో నిఖిల్ తన ప్రయోజనం కోసమే రిలీజ్ పోస్ట్ ఫోన్ చేయాలని చెబుతున్నట్లు నిర్మాత వాదిస్తున్నాడు. నిజానికి స్పై మూవీ టీజర్ కి ఇటీవల భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. కానీ ఇప్పుడు నిఖిల్ వ్యవహార శైలితో రిలీజ్ కు ఇబ్బందులు ఉన్నాయని స్పై మూవీ నిర్మాత చెబుతున్నారు. ప్రస్తుతానికి అయితే షెడ్యూల్ ప్రకారమే విడుదలకు వెళ్లాలని నిర్మాత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ హీరో సహకారం లేకుండా డబ్బింగ్ పనులు పూర్తి కాకుండా అది సాధ్యపడదు. మరి ఈ విషయంలో నిఖిల్ ఏం చేస్తాడనేది చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి: