ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ పేదవారికి ఈ సినిమాను చూపించాలని నేపథ్యంలో ఏకంగా పదివేల టికెట్లను కొనుగోలు చేశారు. మరొకవైపు ప్రముఖ నిర్మాత అభిషేక అగర్వాల్ కూడా పదివేల టికెట్లను కొనుగోలు చేసినట్లు సమాచారం. వీటితో పాటు ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి రామాలయానికి 101 టికెట్లు ఉచితంగా అందజేస్తామని ప్రకటించారు. అలాగే అనన్య బిర్లా కూడా ఈ సినిమాను పేదలకు ఉచితంగా చూపించడానికి టికెట్లను కొనుగోలు చేయడం జరిగింది.
ఇక ఇప్పుడు ఈ జాబితాలోకి మంచు మనోజ్ దంపతులకు కూడా చేరిపోయారు. మంచు మనోజ్ దంపతులు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అనాధ శరణాలయాల్లో ఉన్న 2500 మంది పిల్లలకు ఈ సినిమాను ఉచితంగా చూపిస్తామని అందుకు రెండు ప్రైవేటు సంస్థలతో చేయి కలుపుతున్నామని ప్రకటించారు. ఇకపోతే వీరంతా కూడా ఆది పురుష్ సినిమా కోసం ముందుకు రావడం నిజంగా హర్షదాయకమని చెప్పవచ్చు. ఏది ఏమైనా ఈ సినిమా విడుదలకు ముందే భారీ ధరకు అమ్ముడుపోయి కమర్షియల్ గా మంచి విజయం సాధిస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.