తమిళనాడు లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న రజినీకాంత్ కి తెలుగు లో కూడా మంచి క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఒకప్పుడు ఇక్కడ ఆయనకీ స్టార్ హీరోలతో సరిసమానమైన మార్కెట్ ఉండేది. ఆయన సినిమా హిట్ అయ్యింది అంటే చాలు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ సినిమాలతో పోటీ పడేవి వసూళ్ల పరంగా. అలాంటి మార్కెట్ ఉన్న రజినీకాంత్ గత కొంతకాలం నుండి టాలీవుడ్ లో సరైన సూపర్ హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఒకప్పటి తో పోలిస్తే ఇప్పుడు ఆయన మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే రజినీకాంత్ సినిమాలకు అంత క్రేజ్ మన టాలీవుడ్ లో రావడానికి కారణం ఆయన వాయిస్. చాలా స్టైల్ గా ఆయన మాతృక టోన్ లోనే ఉంటుంది.ఆయనకీ తెలుగులో మొదటి నుండి డబ్బింగ్ చెప్తూ వచ్చాడు ప్రముఖ సింగర్ మను.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో మొదటి నుండి తనకి ఉన్న అనుబంధం గురించి చెప్పుకొచ్చాడు మను. రజినీకాంత్ ఎప్పుడైనా మీతో డైరెక్ట్ గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తూ ' అయ్యో ఎన్నో సార్లు మాట్లాడాడు. ఒక రోజు నేను డబ్బింగ్ చెప్పి బాగా అలిసిపోయి ఇంటికి వచ్చాను. అర్థ రాత్రి 12 కావొస్తుంది, ఆ సమయం లో నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ ఎత్తుకోగానే ఎవరు అని అన్నాను, నేను రజినీకాంత్ ని మాట్లాడుతున్నాను అన్నాడు. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ నాకు ఎందుకు ఫోన్ చేస్తాడు,అది కూడా ఇంత రాత్రి సమయం లో, ఎవరో ఆటపట్టిస్తున్నారు అని తెలిసి ఫోన్ పెట్టరా వెదవ అని రెండు మూడు బూతులు తిట్టాను. అప్పుడు రజినీకాంత్ లేదండి నేను నిజంగానే హీరో రజినీకాంత్ ని మాట్లాడుతున్నాను అన్నాడు. అప్పుడు నేను ఆయన ఎస్సెంట్ చూసి గుర్తు పట్టాను'. ఇంకా ఆయన మాట్లాడుతూ 'రజినీకాంత్ అని నేను గుర్తుపట్టగానే అయ్యో క్షమించండి సార్, ఇంత రాత్రి సమయం లో మీలాంటి సూపర్ స్టార్ ఫోన్ చేస్తాడని ఊహించలేదు అని అన్నాను. పర్లేదండి, ఇప్పుడే శివాజీ సినిమా తెలుగు వెర్షన్ చూసాను, ఎంత బాగా చేసారు చెప్పారు మీరు, నేను కూడా అంత బాగా డైలాగ్స్ చెప్పలేను అని అన్నాడు, ఒక కళాకారుడికి అలాంటి లెజెండ్ నుండి ప్రశంసలు దక్కడం ని మించి ఇంకేమి కావాలి' అంటూ మను ఎంతో ఎమోషనల్ గా మాట్లాడాడు. అతని మాటల్లో రజినీకాంత్ మీద ఆయనకీ ఉన్న గౌరవం ఎలాంటిదో అర్థం అయ్యింది. ప్రస్తుతం రజినీకాంత్ 'జైలర్' అనే చిత్రం లో నటిస్తున్నాడు, ఈ సినిమా తెలుగు వెర్షన్ కి డబ్బింగ్ చెప్పింది కూడా మను నే. బాషా చిత్రం నుండి ఇప్పుడు విడుదల అవ్వబోతున్న జైలర్ వరకు అన్నీ సినిమాలకు మను నే డబ్బింగ్ చెప్పాడు కానీ, ఒక్క పెద్దరాయుడు సినిమాకి మాత్రం సాయి కుమార్ డబ్బింగ్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: