అసలు ఎలాంటి తేడా లేకుండా ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలు కూడా ఆదిపురుష్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ సీత పాత్రలో నటించనుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఈ టీజర్స్, ట్రైలర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఈ సినిమా విషయంలో కొన్ని విమర్శలు ఎదురైనప్పటికి ట్రైలర్ ఇంకా సాంగ్స్ తరువాత ఈ మూవీపై బజ్ భారీగా క్రియేట్ అయ్యాయి. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ విడుదల కానుంది. రామాయణం పై ఇప్పటికే ఎన్నో మూవీలు వచ్చాయి. కానీ ఈ మూవీలో రామాయణం కథను లేటెస్ట్ టక్నాలజీ, వీఎఫ్ఎక్స్ ఉపయోగించి చాలా ఆసక్తికరం గా చూపించనున్నారు.ఇదిలా ఉంటే ఆదిపురుష్ మూవీకి భారీగా బిజినెస్ జరుగుతోంది.


ఈ మూవీతో ఇప్పటి దాకా ఉన్న రికార్డ్స్ అన్ని ఈజీగా బద్దలవుతాయని అంటున్నారు విశ్లేషకులు. ఆదిపురుష్ సినిమా అవలీలగా 2000 కోట్లు వసూలు చేస్తుందని అంటున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఈ మూవీకి వస్తున్న బజ్ చూస్తుంటే 2000 కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టంగా కనిపించడం లేదు.ఇక ఈ మూవీని సినీ సెలబ్రెటీలు కూడా కావాల్సినంతగా ప్రమోట్ చేస్తున్నారు. వేరు వేరు ఫౌండేషన్స్ కోసం సినీ తారలు ఆదిపురుష్ సినిమా టికెట్స్ కొంటున్నారు. పేద పిల్లలకోసం ఇంకా అనాధ పిల్లల కోసం మన హీరోలు ప్రభాస్ టికెట్స్ కొంటున్నారు. ఇప్పటికే రణబీర్ కపూర్ 10వేల టికెట్లు, రామ్ చరణ్ 10వేల టికెట్లు, అభిషేక్ అగర్వాల్ 10వేల టికెట్లు, అనన్య బిర్లా 10వేల టికెట్లు, టీ సిరీస్ ఏకంగా 12 వేల టికెట్లు అలాగే మంచు మనోజ్ 2,500 టికెట్లు, శ్రేయాస్ మీడియా ఖమ్మం జిల్లాలోని రామాలయాలకు ఒకొక్క దేవస్థానానికి ఏకంగా 101 టికెట్లు ఇవ్వనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: