ఇటీవల వచ్చిన చాలామంది హీరోయిన్స్ ఓవర్ నైట్ లొనే స్టార్ట్ డం తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక హిట్ పడితే చాలు వరుస అవకాశం తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ పేరు ప్రపంచమంతా వినబడుతుంది. దాంతో బాలీవుడ్ బ్యూటీలో సైతం టాలీవుడ్ లో సినిమాలు చేయడానికి క్యూ కడుతున్నారు. ఇప్పటికి చాలామంది హీరోయిన్స్ టాలీవుడ్ లో పలు సినిమాల్లో మెరుస్తున్నారు. ఇక అలా వచ్చిన హీరోయిన్లలో మృణాల్ ఠాగూర్ కూడా ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. హను రాగవపుడి దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమాతో

 తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దు గుమ్మా మృణాల్ ఠాగూర్ . మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్. తన అందంతో తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా దగ్గర అయింది మృణాల్ ఠాగూర్  .తెలుగింటి అమ్మాయిల అందరితో కలిసిపోయింది ఈమె. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ రాణిస్తున్న సమయంలో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అలా ఈ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్ లోనే వరుస అవకాశాలు దక్కించుకుంటూ సెటిల్ అయిపోయింది. 

ప్రస్తుతం ఇప్పుడు నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది ఈమె. స్టార్ హీరోయిన్ గా పేరు వచ్చినప్పటికీ నచ్చిన సినిమాల్లో కాకుండా కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది ఈమె. అయితే తాజాగా ఇప్పుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరస్వనా హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుందుట ఈ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ . విజయ్ దేవరకొండ సర్కారు వారి పాట డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతుందట మృణాల్. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: