అయితే ఈ సినిమా కాకుండా ఈ కాంబినేషన్ లో మరో సినిమా ఆగిపోయింది. ఆది సినిమా కంటే ముందే ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కాల్సి ఉంది. మొదట వినాయక్ క్లాస్ లవ్ స్టోరీ చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ను ఒప్పించే ప్రయత్నం చేయగా జూనియర్ ఎన్టీఆర్ కు ఆ కథ నచ్చింది. ఒక ఇంటర్వ్యూలో వినాయక్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. కష్టం అనేది వస్తే లోకువ కాకుండా బయటపడాలని ఆయన అన్నారు.
ఇండస్ట్రీలో నన్ను ఎవరూ ఒరేయ్ అని కూడా అనరని ఆయన వెల్లడించారు. నాకన్నా తెలివైన వాళ్లు చాలామంది ఉన్నారని వినాయక్ తెలిపారు. కొన్ని ఎలా జరుగుతాయో ఎందుకు జరుగుతాయో చెప్పలేమని ఆయన కామెంట్లు చేశారు. ఫస్ట్ నేను లవ్ స్టోరీ రాసుకున్నానని వినాయక్ పేర్కొన్నారు. కృష్ణ, సుమన్ సినిమాలకు నేను ఎక్కువగా పని చేశానని ఆయన కామెంట్లు చేశారు. 40 లక్షల బడ్జెట్ తో తారక్ తో ఆ సినిమా చేయాలని అనుకున్నానని వినాయక్ అన్నారు. తారక్ కు ఆ కథ నచ్చిందని అయితే కొడాలి నాని వద్దని చెప్పడంతో తారక్ ఆ విషయం నాకు చెప్పలేక ఇబ్బంది పడ్డాడని వినాయక్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తారక్ ను మరో ఛాన్స్ అడిగి ఆది కథ చెప్పి డైరెక్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టానని ఆయన తెలిపారు.