‘ఆదిపురుష్’ సినిమాకు సంబంధించిన మొట్టమొదటి టీజర్ విడుదల
అయిన వెంటనే ఆమూవీ టీజర్ కు వచ్చిన నెగిటివ్ ట్రెండ్ ను చూసి ఈ మూవీ పై ప్రభాస్ అభిమానులు కూడ ఆశలు వాడులుకున్నారు. అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తరువాత ఏర్పడిన పాజిటివ్ వాతావరణంతో ఒక్కసారిగా ఈ మూవీ పై మ్యానియా ఏర్పడింది.


తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్లకు ఏర్పడిన డిమాండ్ చూసిన వారు ఇది అంతా ప్రభాస్ మ్యానియా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘బాహుబలి 2’ తరువాత ప్రభాస్ సినిమాలు వరస ఫ్లాప్ లుగా మారినప్పటికీ అతడి క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు అన్న సంకేతాలు ఈ అడ్వాన్స్ బుకింగ్ టిక్కెట్ల మ్యానియా సూచిస్తోంది. ఈ సినిమాకు భాగ్యనగరంలోని అన్నీ మల్టీ ఫ్లేక్స్ లలోను 90 శాతం వరకు టిక్కెట్స్ ఆన్ లైన్ లో పెట్టిన కొన్ని గంటలలోనే బుకింగ్స్ అయిపోవడం ప్రభాస్ మ్యానియాను సూచిస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.


ఈ మూవీకి ప్రస్తుతం కొనసాగుతున్న మ్యానియాను పరిశీలించిన టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఈ మూవీ మొట్టమొదటిరోజు 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ను రాబట్టి మొదటి మూడు రోజులు పూర్తి అయ్యేసరికి మూడు వందల కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూలు చేసినా ఆశ్చర్ర్యం లేదు అంటున్నారు. అయితే ఇది అంతా ఈ సినిమాకు మొట్టమొదటిరోజు మొదటి షో తరువాత ప్రచారంలోకి వచ్చే టాక్ పై ఆధారపడి ఉంటుంది.


మరీ ముఖ్యంగా ఉత్తరాది ప్రాంతాలలోని అనేక ధియేటర్లలో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ టిక్కెట్లు మూడు రోజుల వరకు 90 శాతం పై అమ్మకం జరగడంతో ఈ మూవీ మొదటి 10 రోజులకే 1000 కోట్ల సినిమాగా మారే అవకాశం ఉంది అంటూ మరవకొందరి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ఈసినిమాకు వచ్చే ఓపెనింగ్ కలక్షన్స్ ను బట్టి ప్రభాస్ భవిష్యత్ సినిమాల మార్కెట్ మరింత పెరిగే ఆస్కారం ఉంది..


మరింత సమాచారం తెలుసుకోండి: