ఇక రాముడి పాత్రలో ప్రభాస్ అద్భుతంగా నటించారంటూ కూడా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరొకవైపు ప్రతి థియేటర్లో కూడా హనుమంతుడి కోసం ఒక ఖాళీ సీటును ఉంచాలని డైరెక్టర్ కోరగా ఈ నియమాన్ని అన్ని థియేటర్ల వారు పాటిస్తూ ఉన్నారు. రాముడి కథ ఎక్కడ చెప్పినా సరే కచ్చితంగా అక్కడ హనుమంతుడు వస్తారని ఒక నమ్మకాన్ని మన పూర్వం నుంచి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు తాజాగా థియేటర్లో హనుమంతుడు స్వయంగా విచ్చేసి రామాయణ గాధను వీక్షించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
ఇందుకోసం థియేటర్లో ఒక సీటు హనుమంతుడి కోసం కేటాయించారు అనుకున్నట్టుగానే థియేటర్లో హనుమంతుడు వచ్చి ఆదిపురుష్ సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో థియేటర్లోకి కోతి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది .హనుమంతుడు రాముడు సినిమాకు వచ్చాడంట పలువురు అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఇది చూసిన పలువురు నెటిజెన్లు ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే ఇప్పటివరకు థియేటర్ కోతి వచ్చిన సందర్భాలు చాలా తక్కువే ఒకవేళ వచ్చిన ఈ ఈలలు గోలలకు అక్కడి నుంచి పారిపోతాయి కానీ ఇప్పుడు అలా జరగలేదంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.